బాలయ్య దసరా స్పెషల్ పోస్టర్…. అభిమానులలో గుబులు

NBK 105 posterనటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న చిత్రం కొత్త పోస్టర్ కాసేపటి క్రితం దసరా సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ కొత్త పోస్టర్ లో బాల‌కృష్ణ ర‌క్తం అంటిన క‌త్తిని పట్టుకుని ఉన్నారు. ముఖం అంతా రంగుల‌తో నిండి ఉంది.

అయితే ఈ పోస్టర్ కు అభిమానుల నుండి కూడా నెగటివ్ టాక్ వినిపించడం విశేషం. పోస్టర్ చాలా రొటీన్ గా ఉందని, మరో పస లేని రొటీన్ మాస్ సినిమా తీసేస్తున్నారు అని వారి అనుమానం. గతంలో ఇదే హీరో దర్శకుడి కాంబినేషన్ లో జైసింహా చిత్రం వచ్చింది ఆ సినిమా కూడా పరమ రొటీన్ గా ఉంటుంది. అయితే అప్పుడు సంక్రాంతి వల్ల ఆడింది.

ADVERTISEMENT

ఇప్పటివరకు సినిమా టైటిల్ ని గానీ, విడుదల ప్లాన్ గానీ చిత్రబృందం చెప్పలేదు. అయితే క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అప్పుడు విడుదలైతే మాత్రం కొంత మేర పోటీకూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ అక్టోబ‌ర్ 18 నుండి రామోజీ ఫిలిమ్ సిటీలో జ‌ర‌గ‌నుంది.

ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నా భారీ విలేజ్ సెట్‌ను వేశారు. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక చావ్లా, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలయ్య వందవ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణికి స్వరాలు కూర్చిన చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా.. రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories