నీవెవరో టాక్… ఏవేవో చెప్తున్నారు..!

neevevaro movie public talk‘రంగస్థలం’ సినిమాతో తనకు లభించిన ఆదరణతో రెట్టించిన ఉత్సాహంలో ఉన్న ఆది పినిశెట్టి, “నీవెవరో” సినిమాపై భారీ ఆశలనే పెట్టుకున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘గీత గోవిందం’ రాజ్యమేలుతుండడంతో, ఈ సినిమాపై పెద్దగా బజ్ ఏర్పడలేదు గానీ, ధియేటిరికల్ ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గా అనిపించింది. మరి రిలీజ్ తర్వాత కూడా అలాంటి అనుభూతే ప్రేక్షకులకు కలిగిందా? అంటే కాదనే సమాధానమే వెలువడుతోంది.

ADVERTISEMENT

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆది తన పాత్ర వరకు నూటికి నూరు శాతం న్యాయం చేయగలిగారు గానీ, దర్శకుడు హరినాథ్ మాత్రం విఫలం కావడంతో… ప్రేక్షకులకు కావాల్సిన థ్రిల్ మిస్ అయ్యిందనే టాక్ వ్యక్తమవుతోంది. సెకండాఫ్ లో అనవసరమైన కామెడీ కోసం చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో, “నీవెవరో” ధియేటర్ నుండి వస్తోన్న ప్రేక్షకులు “ఏవేవో” చెప్పుకొస్తున్నారు. అయితే ఈ సినిమాకు పోటీగా రిలీజైన ‘ఆటగాళ్ళు, అంతకుమించి’ సినిమాల కంటే మెరుగైన రీతిలో ‘నీవెవరో’ ఉండడం ప్లస్ పాయింట్.

ADVERTISEMENT
Latest Stories