పూరీ జగన్నాధ్ పై దాడిలో చేరిన ‘ట్విస్ట్’

new twist in puri jagannath  case, loaferసినీ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గన్నాథ్‌పై తాము దాడి చేశామ‌ని వ‌స్తోన్న వార్తలు పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని డిస్ట్రిబ్యూట‌ర్లు అభిషేక్, సుధీర్, రాంధాస్ లు స్పందించారు. పూరీ ఇంటికి వెళ్లినట్టు, ఫోన్‌లో మాట్లాడిన‌ట్లు ఆధారాలేమీ లేవని, పూరీపై తామెందుకు దాడి చేస్తామ‌ని… ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టత ఇచ్చారు.

దీనిపై విచార‌ణ చేయాల‌ని, త‌ప్పుంటే త‌మ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, త‌మ‌పై త‌ప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. సీసీ కెమెరాలు ప‌రిశీలిస్తే నిజానిజాలు బ‌య‌ట ప‌డ‌తాయని అన్నారు. త‌మ‌పై వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల‌పై క్లారిటీ ఇద్దామ‌నే మీడియా ముందుకు వ‌చ్చినట్లు, త‌మ‌పై దుష్ప్రచారం చేస్తున్నారని సదరు డిస్ట్రిబ్యూట‌ర్లు ఆరోపించారు. దీంతో ఈ కేసులో ఊహించని ‘ట్విస్ట్’ వచ్చినట్లయింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories