బెంగళూరు నుండి జగన్ ని కలవడానికి వచ్చిన ప్లాప్ హీరో

Nikhil Gowda Meets YS Jaganఅప్పట్లో జాగ్వర్ అనే ప్లాప్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ గౌడ గుర్తున్నాడా? అతను కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, మాజీ ప్రధాని దేవగౌడ మనవడు. సినిమాలలో పని జరగకపోవడంతో రాజకీయాలలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించున్నాడు. ప్రముఖ నటుడు కాంగ్రెస్ నేత అంబరీష్ మరణంతో ఆయన భార్య సుమలత కాంగ్రెస్ తరుపున పోటీ చేయాలనుకుంది. కానీ కాంగ్రెస్ ఈ సీటు మిత్రపక్షం జేడీఎస్‌కు కేటాయించడంతో సుమలత ఇక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో స్వతంత్య్ర అభ్యర్ధిగా ఎన్నికల్లో నిలబడింది.

ADVERTISEMENT

ఆయనపై పోటీ చేసి ఓడిపోయాడు మన యువ హీరో. ఇప్పుడు ఆయన ఉన్నఫళంగా అమరావతిలో ప్రత్యక్షం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీ ఉద్దేశమేంటో తెలియరాలేదు. వైఎస్‌ జగన్‌ రాజకీయ పోరాటం తన వంటి యువ నాయకులకు స్ఫూర్తిదాయకమని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ గౌడ అన్నారు. అమరావతిలోని సీఎం క్యాంప్‌ ఆఫీసులో జగన్‌ను కలిసి నిఖిల్‌ శుభాకాంక్షలు తెలిపారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన ఫేస్‌ బుక్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు. రాజకీయాలలో ఫెయిలైన నిఖిల్ మళ్ళీ సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. రజినీకాంత్, శంకర్లతో 2.0 లాంటి బారి ప్రాజెక్టును నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ నిఖిల్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తుంది. లైకా సంస్థతో త్వరలోనే సినిమాను స్టార్ట్ చేయాలనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ కొత్త ప్రాజెక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

ADVERTISEMENT
Latest Stories