కార్తికేయ 2 పాన్ – ఇండియా సక్సెస్ తరువాత నిఖిల్ స్టార్ మారిపోయింది. స్పై, ది ఇండియా హౌస్, స్వయంభు అలా మూడు ఇంట్రెస్టింగ్ సినిమాలు పట్టాలెక్కిస్తున్నాడు. స్పై… సుభాష్ చంద్రబోస్ కథ… పాన్ – ఇండియా సబ్జెక్టు… టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అన్నీ బానే కుదిరాయి… జూన్ 29న రిలీజ్ అనుకున్నారు… అయితే ఇక్కడే అసలు గొడవ మొదలయ్యింది.
Also Read – పోలీస్ గడప దాటించి కోర్టుకి తీసుకువెళ్తే చాలు.. కేసు ఫినిష్!
జూన్ 29 రిలీజ్ అంటే పట్టుమని 20 రోజులు కూడా లేదు. ఈ నెల 15,16 తారీఖులలో ఒక స్పెషల్ బ్లాక్ షూట్ ప్లాన్ చేసుకున్నారు. అది షూట్ చేసి, సీజీ చేసి 23 కల్లా సెన్సార్ కు ఇవ్వాలి.
పాటలు రిలీజ్ చెయ్యాలి, ట్రైలర్ రిలీజ్ చెయ్యాలి. పాన్ – ఇండియా ప్రమోషన్లు ఎలాగూ ఉన్నాయి. ఇవన్నీ పర్ఫెక్ట్ గా చెయ్యాలంటే 29 కి రిలీజ్ కావడం కష్టమని నిఖిల్ వాదన.
Also Read – అభివృద్ధి కంటే వినాశనానికే మద్దతెక్కువా..?
అయితే ప్రొడ్యూసర్ మాత్రం డేట్ మిస్ అవ్వకూడదు అని గట్టిగా కూర్చున్నాడు. ఖర్చుబెట్టింది నాన్ – థియేట్రికల్ మీదే వచ్చేసింది. థియేట్రికల్ మీద గట్టిగా టేబుల్ ప్రాఫిట్… డేట్ మిస్ అయితే డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు కట్టరని భయం.
పైగా డబ్బులు చేసేసుకున్నాం కదా ఇంకెందుకు ఖర్చు అని ఇంకో పక్క…
Also Read – వైసీపీ నేతలు ధీమాగానే ఉన్నారు మరి ప్రభుత్వం?
హీరో మాట కాదని ఒక పాట ని ఉన్నఫళంగా రిలీజ్ చేసేశారు ప్రొడక్షన్ టీమ్. హీరో ఫుల్ గా అప్సెట్ కనీసం పాట గురించి ట్వీట్ కూడా చెయ్యలేదు.
సినిమా అవుట్ ఫుట్ కంప్లీట్ గా లేకపోతే నాకు మాటొస్తుంది కాబట్టి తగ్గేదేలే అంటున్నాడు నిఖిల్.
అవును మరి సక్సెస్ నిలబెట్టుకోవాలంటే ఆ మాత్రం తపన ఉండాలి!