అన్నీ షరా మామూలే… టిడిపి ఎమ్మెల్యే నిమ్మల అరెస్ట్‌!

Nimmala-Rama-Naidu-Police-Arrestవైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తమ అధినేత సిఎం జగన్మోహన్ రెడ్డి తీరుని తప్పు పట్టినందుకు ఆయన అరికాళ్ళు వాచిపోయాయి. దాంతో ఆయన ఏపీలో అడుగుపెట్టేందుకు భయపడి మూడేళ్ళుగా ఢిల్లీలోనే కాలక్షేపం చేస్తున్నారు.

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముగ్గురూ తమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు ఎందుకు జరుగడం లేదని ప్రశ్నించినందుకు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు.

ADVERTISEMENT

‘జగనన్నే వెంటే జీవితాంతం’ అని పదేపదే చెప్పుకొన్న వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని మెడపట్టుకొని బయటకు గెంటేశారు. వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితే ఈవిదంగా ఉంటే ఇక టిడిపి నేతల, ఎమ్మెల్యేలకు ఎటువంటి ట్రీట్మెంట్ లభిస్తుందో పట్టాభిని అడిగితే చెపుతారు. కనుక పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హడావుడిగా చేస్తే ఏమవుతుంది? అదే జరిగింది. పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

యలమంచి మండలం, చించినాడలో దళితుల భూములలో కొందరు వైసీపీ నేతలు మట్టి తవ్వకాలు జరుపుతున్నారని తెలుసుకొన్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, దళితులకు అండగా నిలబడేందుకు ఈరోజు ఉదయం కారేసుకొని బయలుదేరారు. కానీ దారిలో పోలీసులు ఆయనను అడ్డుకొన్నారు.

ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశ్యించి, “ఇది నా నియోజకవర్గం. నా నియోజకవర్గంలో నేను తిరిగేందుకు మీ అనుమతి తీసుకోవాలా?అక్కడ దళితుల భూములను వైసీపీ నేతలు తవ్వేస్తుంటే మీరు వెళ్ళి వాళ్ళను అడ్డుకొని అరెస్ట్‌ చేయకుండా వారిని అడ్డుకొనేందుకు వెళుతున్న నన్ను అరెస్ట్‌ చేయడం ఏమిటి?అసలు మీరు నన్ను ఏ కారణంతో అరెస్ట్‌ చేస్తున్నారు? ఇవాళ్ళ అరెస్ట్‌ చేస్తే రేపు మళ్ళీ నేను అక్కడకి వెళ్ళకుండా మీరు అపగలరా?దళితుల భూములను వైసీపీ నేతలు తవ్వేస్తుంటే మీకేమీ సంబందం లేదా?” అంటూ ఆగ్రహంగా ప్రశ్నించారు. కానీ చివరికి ఏమి జరగాలో అదే జరిగింది. పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు.

ADVERTISEMENT
Latest Stories