నిమ్మల రామానాయుడుకి ముంపు గ్రామాల ప్రజలు జేజేలు

Nimmala-Ramanaiduపశ్చిమ గోదావరి జిల్లాలో ముంపు గ్రామాల ప్రజలు నేటికీ అష్టకష్టాలు పడుతుంటే వారిని ఆదుకోవలసిన జిల్లా మంత్రి, అధికార పార్టీ నేతలు రాజకీయాలతో తీరికలేకుండా గడుపుతున్నారు. వారు చేయాల్సిన పనిని పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేస్తున్నారు. గ్రామాలను వరదలు ముంచెత్తినప్పటి నుంచి ప్రతీరోజూ గ్రామాలలో పర్యటిస్తూ వారికి ధైర్యం చెపుతున్నారు. వారికి సొంత డబ్బుతో నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ముంపు గ్రామాలలో ఎవరికి ఆరోగ్య సమస్యలు వచ్చినా తక్షణం స్పందించి సాయపడుతున్నారు.

ముంపు గ్రామాలు మెల్లగా కొలుకొంటున్నా అవి పూర్తిగా కోలుకోనేవరకు యధాశక్తిన గ్రామ ప్రజలకు సాయపడుతూనే ఉంటానని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చెప్పారు. వరద వలన గ్రామాలలో ప్రజలకే కాదు… పశువులకు కూడా పచ్చగడ్డి, ఎండుగడ్డి లభించడం లేదని గుర్తించిన నిమ్మల వారంలో రెండు రోజులు ట్రాక్టరుపై గడ్డిమోపులు వేసుకొని ఊరూరు తిరుగుతూ పశువులున్నవారికి ఉచితంగా గడ్డి అందజేస్తున్నారు.

ADVERTISEMENT

ఆయన ఔదార్యం చూసి ముంపు గ్రామాల ప్రజలు ఎంతో ఉప్పొంగిపోతూ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు. ఇన్ని రోజులుగా అధికార పార్టీ నేతలు ఒక్కరూ తమ గ్రామాలకు రాలేదని కానీ నిమ్మల మాత్రం ప్రతీరోజూ ఏదో ఓ గ్రామానికి నిత్యావసర సరుకులో, గడ్డి మోపులో పట్టుకొని వస్తూనే ఉన్నారని చెప్పారు. ప్రజా ప్రతినిధి అంటే టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడులా ఉండాలని గ్రామస్తులు చెపుతున్నారు. వైసీపీ నేతలూ… వింటున్నారా… చూస్తున్నారా?


ADVERTISEMENT
Latest Stories