బడ్జెట్ లో ఏపీకు సున్నా… ఇప్పుడు అనుకుని ఏం లాభం?

Nirmala sitharaman Budget 2020 -nothing for andhra pradeshకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో బడ్జెట్-2020ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే అనుకున్నట్టుగానే ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు గానీ తెలంగాణకు గానీ ఎటువంటి ప్రత్యేక కేటాయింపులు లేవు. వైఎస్సార్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీకి కేంద్రం మొండిచెయ్యి చూపించిందన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎదురుచూశామని అయితే బడ్జెట్‌లో హోదా ప్రస్తావనే లేదన్నారు.”మా ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది. వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఏపీకి బడ్జెట్‌ నిరుపయోగం. పోలవరాన్ని ఆలస్యం చేయొద్దు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనడంలో స్పష్టత లేదు. ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదు. రాష్ట్రాలపై కేంద్రం పక్షపాత ధోరణి చూపించకూడదు’ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

అయితే దీనిపై విజయ సాయి రెడ్డి సోషల్ మీడియాలో తీవ్ర నిరసన ఎదురుకుంటున్నారు. “అసలు ప్రత్యేక హోదా కోసం మీ ప్రభుత్వం ఏం ప్రయత్నం చేసిందని మీరు రాలేదని నిరాశపడుతున్నారు. కనీసం ప్రయత్నం చెయ్యకుండా మీ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిన మొదటి సారే మోడీ కి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి ఏం చెయ్యలేము అని చేతులెత్తేసిన మాట వాస్తవం కాదా?,” అని వారు ప్రశ్నిస్తున్నారు.

“ప్రత్యేక హోదా గురించి కనీసం ప్రస్తావించారా మీరు? పార్లమెంట్ లో ఆ విషయాన్ని ఎప్పుడైనా అడిగారా? ప్రతీ విషయంలో కేంద్రం అడుగులకు మడుగులు ఒత్తి ఇప్పుడు ఏమీ తేలినట్టు నెపం బీజేపీ మీద వేస్తున్నారా?,” అంటూ చాలా మంది విమర్శిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories