ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పుడు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు

Prashant Kishor Makes Political Debut with NDA Allyఎన్నికల వ్యూహకర్తగా ఖ్యాతిగాంచిన ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పుడు జనతాదళ్‌(యునైటెడ్‌) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. బిహారు ముఖ్యమంత్రి, జేడీ(యు)సారధి నితీశ్‌కుమార్‌ మంగళవారం ఈ మేరకు నియామకం చేశారు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ 2019 ఎన్నికల కోసం పని చేస్తున్నారు.

ADVERTISEMENT

[m9ad]

ఇటీవలే ఆయన రాజకీయాలలోకి వస్తున్నట్టు ప్రకటించి జనతాదళ్‌(యునైటెడ్‌) లో చేరారు. జగన్ పార్టీ బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుందని పుకార్లు షికారు చేస్తున్న నేపథ్యంలో ఎన్డీయేలో కీలక భాగస్వామి ఐన జనతాదళ్‌(యునైటెడ్‌) లో చేరడం ఆసక్తి కలిగిస్తుంది. తాను ఏ పార్టీలో ఉన్న తన సంస్థతో సంబంధం లేదని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పుకొచ్చారు.

అయితే ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలకు ఈ సంజాయిషీ సరిపోతుందో లేదో చూడాలి. 2014 ఎన్నికలలో బీజేపీ తరపున పని చేసిన ప్రశాంత్‌ కిశోర్‌ ఆ తరువాతి కాలంలో మోడీ అమిత్ షాల తో విభేదించి కొంత కాలం కాంగ్రెస్ కు పని చేసారు. ఇప్పుడు మళ్ళీ ఒకరకంగా కమలం పార్టీ గూటికే చేరినట్టు అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories