జై లవకుశ… ఫుల్ క్లారిటీ..!

No Audio Launch for NTR Jai Lava Kusaసెప్టెంబర్ 21వ తేదీన విడుదలకు ముహూర్తం కుదుర్చుకున్న “జై లవకుశ” సినిమా ఇప్పటికి రెండు టీజర్లను విడుదల చేసుకుని భారీ అంచనాలను ఏర్పాటు చేసుకుంది. ‘కుశ’ సంబంధించిన మరో టీజర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్న నేపధ్యంలో అంతకుమించిన అప్ డేట్స్ ను అందించింది చిత్ర నిర్మాణ సంస్థ. సెప్టెంబర్ 3వ తేదీన ఈ సినిమా ఆడియో నేరుగా మార్కెట్ లో విడుదల కానుందని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తమ ట్విట్టర్ ఖాతాలో స్పష్టత ఇచ్చింది.

ADVERTISEMENT

నిజానికి భారీ బహిరంగ వేడుకను ప్లాన్ చేసామని, కానీ వరదలు మరియు వినాయకుని నిమజ్జనం రీత్యా… అభిమానులు మరియు ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఆ సమయంలో బహిరంగ వేడుక నిర్వహించడం సముచితం కాదన్న భావనతో ఆడియో వేడుకను జరపడం లేదని స్పష్టత ఇచ్చారు. అయితే సెప్టెంబర్ 10వ తేదీన ఓ భారీ బహిరంగ వేడుకను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నామని, అప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేస్తామని తెలిపింది.

దేవిశ్రీప్రసాద్ అందించిన ఈ పెప్పీ ఆల్బమ్ ను మీరంతా ఇష్టపడతారని ఆశిస్తున్నామని ప్రొడక్షన్ యూనిట్ స్పష్టం చేయడంతో, మరో మూడు రోజుల్లోనే ‘జై లవకుశ’ పాటలు శ్రోతలను పలకరించబోతున్నాయి. ఇప్పటికే ‘రావణా’ అన్న పాట లీక్ అయ్యి, ప్రజాధరణ పొందడంతో ఈ ఆల్బమ్ గ్యారెంటీ హిట్ జాబితాలోకి వెళ్లిపోయినట్లుగానే ‘యంగ్ టైగర్’ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇలా ‘జై లవకుశ’పై ఫుల్ సమాచారం ఇవ్వడంతో, అభిమానులు కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories