జగన్ సతీమణిపై నాన్ బెయిలబుల్ వారెంట్!

Non-Bailable Warrant to Jagan's Wife YS Bharathiవైసీపీ అధినేత జగన్ భార్య భారతీరెడ్డికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ అయింది. కాల్ మనీ కేసులో తనపై అసత్యపు వార్తలను ప్రచురించారంటూ కృష్ణా జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు సాక్షి దినపత్రికపై నూజివీడు కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి సాక్షి ఎండీ భారతీరెడ్డి, ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తిలకు సమన్లు జారీ చేసినా… వారు కోర్టుకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో, వీరిద్దరిపైనా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories