నందమూరి అభిమానులకు…మెగా అభిమానులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే…అయితే ఒకేసారి ఇరు వర్గాల హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా ఒక సినిమాపై మరొక వర్గం విమర్శలు చెయ్యడం చాలా కామన్. అయితే ఇప్పుడు ఎన్ఠీఆర్ బయోపిక్ పై మెగా గ్రూపులు అన్నీ కలసి యుద్ధం మొదలు పెట్టాయి అని సోషల్ మీడియా సాక్షిగా హడావిడి మొదలయ్యింది.
దానికిగల కారణాలు ఏంటి అంటే..ఒక పక్క బాలయ్య బయోపిక్ తో పాటే…రెండు రోజుల వ్యవధిలో చెర్రీ వినయ విధేయ రామ వస్తుంది..ఆ సినిమాని లేపడానికి మెగా గ్రూప్స్ అన్నీ కలసి బయోపిక్ పై బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చెయ్యాలి అని ప్లాన్ చేసినట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి…ఇప్పటికే సినిమా “ఇన్సైడ్ టాక్” పోయింది అని తెలుస్తుంది అని…మెగా గ్రూప్స్ విష ప్రచారమా చేస్తున్న సంగతి తెలుస్తుంది.
అయితే దీని వెనుక మరో కారణం కూడా ఉంది..అదే రాజకీయ విభేదం…బాలయ్య స్వతహాగా తెలుగుదేశం పార్టీ మనిషి కావడం..మరో పక్క మెగా వర్గం సొంత కుంపటి పెట్టి ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం…ఇక అప్పుడెప్పుడో బాలయ్య పవన్ ని “పవన్ ఎవరో నాకు తెలీదు” అని విమర్శలు చెయ్యడం…దానికి మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్లు ఇవ్వడం..అన్నీ వెరసి బాలయ్య సినిమాపై దాడి చేస్తున్నాయి..మెగా వర్గాలు..
మరి వీటన్నింటినీ తట్టుకుని బాలయ్య బయోపిక్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.



