‘జనతా గ్యారేజ్’ పక్కా లోకల్ ఫుల్ సాంగ్ – విజిల్స్ వేయాల్సిందే!

ntr-janatha-garaga-pakka-local-song-chipmunk-versionజూనియర్ ఎన్టీఆర్ నటించిన “జనతా గ్యారేజ్”లో ఓ స్పెషల్ సాంగ్ ఉన్న విషయం తెలిసిందే. ‘పక్కా లోకల్’ అంటూ ఈ పాటలో నర్తించిన కాజల్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో అన్నది పక్కన పెడితే… ప్రస్తుతం వెబ్ మరియు సోషల్ మీడియాలో ఈ పాటకు చింపుంక్ వర్షన్ లో ఎడిటింగ్ చేసిన పాట ఓ రేంజ్ లో హల్చల్ చేస్తోంది.

నిజం చెప్పాలంటే… సినిమాలో చేసిన కొరియోగ్రఫీ కంటే వీక్షించడానికి ఈ పాట అద్భుతంగా ఉందని చెప్పాలి. అలాగే కాజల్ చెప్పుల కంటే ఈ పాటలో వేసే స్టెప్స్ నిజంగా ధియేటర్ లో పడుంటే… విజిల్స్ తో ధియేటర్లు దద్దరిల్లిపోయేవని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచంలో క్రియేటివిటీ ఏ స్థాయిలో ఉందో చాటిచెప్పే విధంగా ఈ పాటను పేర్కొనవచ్చు. మరి అంతలా సోషల్ మీడియాను ఊపేస్తున్న ఈ పాటపై ఓ లుక్కేయండి..!

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories