జూనియర్ ఎన్టీఆర్ “మహాభారతం”పై రాజమౌళి వ్యాఖ్యలు?

jr-ntr-rajamouliజూనియర్ ఎన్టీఆర్ కు ఒక్క రాజమౌళి తప్ప, మరే దర్శకుడు ‘ఇండస్ట్రీ హిట్’ ఇవ్వలేరన్న టాక్ తో వీరిద్దరి కాంభినేషన్ పై మళ్ళీ ఎప్పుడు సినిమా వస్తుందా? అన్న ఆసక్తి తారక్ అభిమానులతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ ఉంది. అయితే ఇటీవలే ‘స్టూడెంట్ నెం.1’ సినిమా ద్వారా రాజమౌళి 15 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో, మళ్ళీ ఈ ఇద్దరి కాంభినేషన్ గురించి తీవ్రంగా చర్చ జరిగింది. దీనిపై జక్కన్న తన సన్నిహితులతో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రాజమౌళి తన ‘డ్రీం ప్రాజెక్ట్’గా ‘మహాభారతం’ సినిమాను అభివర్ణించిన విషయం తెలిసిందే. దీని గురించే ఈ దర్శక ధీరుడు చెప్పినట్లుగా ఈ వార్తల సారాంశం. జూనియర్ ఎన్టీఆర్ లేని “మహాభారతం” ఉండదని, మహాభారత కథతో తాను త్వరలో తెరకెక్కించబోయే సినిమాలో ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆరే హీరో అని రాజమౌళి తన స్నేహితులతో అన్నట్టు ఫిలింనగర్ టాక్. బాహుబలి సినిమాతో భారీ చిత్రాలను నిర్మించడంలో తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకున్న రాజమౌళి అంతకుమించిన భారీ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

ADVERTISEMENT

‘మహాభారతం’లోని కథతో సినిమాను తెరకెక్కించనున్నట్టు గతంలో పలు సందర్భాల్లో రాజమౌళినే చెప్పడంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అందులో భాగంగా వివిధ పాత్రలకు నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో జక్కన్న ఉన్నట్టు సమాచారం. ఆ సినిమాలో మాత్రం యంగ్‌టైగర్ ఎన్టీఆరే హీరో అని, ఆయన కోసం అందులో కొన్ని పాత్రలు వున్నాయని రాజమౌళి నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్ని ఆయన తన స్నేహితులతో చర్చించినట్టు సమాచారం. ఇప్పుడు ఇదే విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ADVERTISEMENT
Latest Stories