ఎన్టీఆర్ కిక్ పోగొట్టాడు!

ntr Prashanth Neel new movie updateఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే. సహజంగా బర్త్ డే అనే సరికి ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే ఈ ఏడాది బర్త్ డేకు ఎన్టీఆర్ కరోనా సోకి హోమ్ ఐసొలేషన్ లో ఉండటం అభిమానులకు ఒకింత నిరాశగానే ఉందనే చెప్పుకోవాలి. ఇక బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ కొత్త పోస్టర్ విడుదల చేశారు.

పోస్టర్ బాగానే ఉన్నప్పటికీ ఫ్యాన్స్ ఆకలి తీర్చే స్థాయిలో అయితే లేదని ఫ్యాన్స్ పెదవి విరిచారు. ఇక ఎన్టీఆర్ తదుపరి చిత్రం…. కొరటాల దర్శకత్వం వహిస్తున్న #NTR30 కు సంబంధించిన ఎటువంటి అప్డేట్ కూడా బయటకు రాలేదు. పాత ఫోటో తో ఒక పోస్టర్ చేసేసి బర్త్ డే విషెస్ చెప్పేసి ఊరుకున్నారు ఆ చిత్ర నిర్మాతలు.

ADVERTISEMENT

ఈరోజు హైలైట్ అంటే #NTR31 ప్రకటన అనే చెప్పుకోవాలి. సరైన మాస్ సినిమా కోసం ఎన్నాళ్ల నుండో వేచి చూస్తున్న అభిమానులకు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా అనేసరికి ప్రాణం లేచి వచ్చింది. అయితే ఒకరకంగా చాలా ఆసక్తికరమైన ఈ అప్డేట్ ని ఎన్టీఆర్ స్వయంగా కిక్ పోగొట్టాడు అనే చెప్పుకోవాలి.

కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు ఉంటుందని ఎన్టీఆర్ చెప్పేశాడు. దానితో కిక్ ఫ్యాక్టర్ లోపించింది. అసలు ఎటువంటి హింట్ ఇవ్వకుండా సడన్ గా ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన చేసి ఉంటే అభిమానులు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసేవారు. 2020 ద్వితీయభాగంలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లి 2023లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories