‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న విఐ ఆనంద్ దర్శకత్వం తాజా చిత్రం “ఒక్క క్షణం.” అల్లు శిరీష్ హీరోగా నటించిన ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఒకరి జీవితంలో జరిగిన సంఘటనలు మరొకటి జీవితంలో రిపీట్ అవ్వడం అనేది ఈ కధ ఇతివృత్తం.
దీనిని టీజర్ లోనే చూపించగా, తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో కూడా అదే అంశాన్ని స్పష్టంగా చూపించారు. ప్రేక్షకులకు ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా చూపించడంతో ఈ నెల 28వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. చూడబోతుంటే విఐ ఆనంద్ ద్వితీయ విఘ్నాన్ని అవలీలగా దాటేలా కనపడుతున్నాడు. ఇదే జరిగితే అల్లు శిరీష్ ఖాతాలో మొదటి కమర్షియల్ హిట్ పడ్డట్టే!
ADVERTISEMENT
ADVERTISEMENT



