పాయే… ఏపీలో దేవస్థానం టికెట్లు పాయే..!

Online Ticket stopped in andhra pradesh templesఆర్ధిక పరంగా జగన్ సర్కార్ పడుతోన్న పాట్లకు నిదర్శనంగా మరో సంఘటన వెలుగు చూసింది. కనీసం 10 కోట్లు కూడా చెల్లించలేని దయనీయ పరిస్థితిలో ఏపీ సర్కార్ ఉందన్న విషయం మీడియా వర్గాల వేదికగా బయటకు వచ్చింది.

ADVERTISEMENT

ప్రస్తుతం ఏ దేవాలయంలో అయినా ఆన్ లైన్ టికెట్లే మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఏపీలో గడిచిన రెండు రోజులుగా ఆన్ లైన్ టికెట్లు కాకుండా, పదేళ్ల క్రితం మాదిరి ముద్రించిన టికెట్లను ప్రముఖ దేవాలయాలలో ఇస్తున్నారు. అంటే రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిందా?

పదేళ్లు వెళ్లిందో, ఇరవై ఏళ్ళు వెళ్లిందో తెలియదు గానీ, 2016 నుండి ఆన్ లైన్ టికెట్ల మంజూరు కోసం ఏపీటీఎస్ (ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్) ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ సేవలను అందిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ నిమిత్తం 10 కోట్లుగా కేటాయించాలని ఏపీటీఎస్ దేవాదాయశాఖను కోరినట్లుగా తెలుస్తోంది.

అయితే సదరు మొత్తాన్ని దేవాదాయశాఖ చెల్లించకపోవడంతో ఏపీటీఎస్ తన సేవలను నిలిపివేసింది. దీంతో మొత్తం విజయవాడ దుర్గమ్మ గుడి మొదలుకుని, అన్నవరం సత్యనారాయణ స్వామి, సింహాచలం లక్ష్మి నరసింహస్వామి వంటి ప్రముఖ దేవాలయాలతో పాటు మొత్తం 174 ఆలయాలలో ఆన్ లైన్ సాఫ్ట్ వేర్ సేవలు నిలిచిపోయాయి.

ఈ విషయంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా ఏపీలో భక్తులు ఇచ్చే విరాళాలకు ఎప్పుడు కొదవ ఉండదు. అలాంటిది కేవలం 10 కోట్ల రూపాయలను కూడా చెల్లించలేకపోవడం అంటే, దేవాదాయశాఖ ఆదాయం ఎటు పోతోంది? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories