ఒక సినిమా కోసం చిత్ర యూనిట్ ఎంతగా కష్టపడతారోనని చెప్పడానికి నిదర్శనం ఈ పిక్. “ఆపరేషన్ గోల్డ్ ఫిష్” పేరుతో అడివి సాయికిరణ్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లోని కార్గిల్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సదరు సంగతులను తన ట్విట్టర్ ఖాతా ద్వారా దర్శకుడు సాయికిరణ్ పంచుకున్నాడు.
[m9ad]
సముద్ర మట్టానికి 13,500 అడుగుల ఎత్తున ‘-10’ డిగ్రీల సెల్సియస్ వాతావరణంలో “ఆపరేషన్ గోల్డ్ ఫిష్”కు సంబంధించిన చివరి షెడ్యూల్ షూటింగ్ చేస్తున్నామని స్పష్టం చేసాడు. ఆది, అబ్బూరి రవి మరియు మిగిలిన చిత్ర యూనిట్ అంతా షూటింగ్ లో ఉన్నారని, ఫస్ట్ లుక్ ను త్వరలోనే రిలీజ్ చేస్తామని మంచుకొండల్లో తిరుగుతున్న ఓ పోస్టర్ ను ఈ సందర్భంగా పోస్ట్ చేసాడు.
ఇటీవల వినాయకచవితి పర్వదినాన ఈ సినిమా ప్రీ లుక్ తో కూడిన మోషన్ పిక్చర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆది, శశా చేట్ట్రి, నిత్యా నరేష్ లు ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, ‘వినాయకుడు’ సినిమా ప్రొడ్యూసర్లు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.



