మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పూరీ – బాలయ్యల “పైసా వసూల్” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో నందమూరి నటసింహం బాలకృష్ణ బిజీగా ఉన్నారు. సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్న బాలయ్య… తన కెరీర్ లో ఇంతవరకు ఇలాంటి సినిమా చేయలేదని, ఇదే ఇప్పుడు ఈ సినిమాపై హైప్ ను పెంచుతుందని అన్నారు. ఈ సినిమా ఆరంభంలో నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంటుందని, తరువాత నెమ్మదిగా పుంజుకుని అద్భుత విజయం సాధిస్తుందని బాలయ్య చెప్పడం కొసమెరుపు.
తాను ఊహించినట్టే ఇప్పటివరకు మొదట నెగిటివ్ టాక్ వచ్చిందని, అన్న బాలయ్య, ఈ సినిమా ఎప్పుడు చూద్దామా? ఎంత తొందరగా విడుదలవుతుందా? అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం చాలా సరదాగా గడిచిపోయిందని, ఓ రోజు విదేశాల్లో షూటింగ్ చేస్తున్న సమయంలో షూటింగ్ స్పాట్ లో స్లీపింగ్ బ్యాగ్ లో దూరి శ్రియ హీరోయిన్ నిద్రపోయిందని గుర్తు చేసుకున్నారు.
షూటింగ్ కోసం యూనిట్ మొత్తం పనిలో ఉంటే శ్రియ పడుకుండి పోతుండడంతో బ్యాగ్ లో దూరి జిప్పేసుకున్న ఆమె దగ్గరకి తాను వెళ్లానని, తరువాత బ్యాగ్ పై నుంచి భుజంపై సరదాగా కొట్టానని అన్నారు. దీంతో బ్యాగ్ లోంచి బయట ఎవరు? అలా చేస్తున్నారని శ్రియ విసుక్కునేదని, మళ్లీ కాసేపు మౌనంగా ఉండి, మళ్లీ ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేసేవాడినని తన చిలిపి పనుల గురించి చెప్పుకొచ్చారు. దీంతో ఆ రాత్రంతా శ్రియ నిద్రపోలేదని, తరువాత తనను చూసి సారీ చెప్పిందని బాలయ్య నవ్వుతూ వెల్లడించారు.


