‘పైసా వసూల్’ సీక్రెట్ అదే!

It’s Official: Paisa Vasool To Take On Jawaanనందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందించిన ‘పైసా వసూల్’ చిత్రం మొదటి షో మరికొద్ది గంటల్లో పడనుంది. దీంతో ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలయ్య ఈ సినిమా ‘సీక్రెట్’ ఇదేనంటూ ఓ సంగతిని చెప్పుకొచ్చారు. ‘ఈ సినిమాలో నా అసలు పేరేంటో ఇంతవరకు బయట పెట్టలేదు. అదే అసలు సీక్రెట్. కావాలనే వ్యూహాత్మకంగా మేము బయటపెట్టలేదు. సినిమా విడుదలైనపుడే ప్రేక్షకులకు తెలుసుకోవాలని భావించే రివీల్ చేయలేదని’ చెప్పారు.

నా క్యారెక్టర్ పేరేంటో తెలుసుకుంటారు. ఈ సినిమాలో తాను చాలా అందంగా కనపడటానికి కారణం పూరీ, ఛార్మీయే. ఈ సినిమాలో ఖచ్చితంగా నన్ను డిఫరెంట్ గా చూస్తారు. ఈ సినిమాలో నేను పాట పాడాను. ప్రతి సినిమాకు వైవిధ్యం చూపించాలన్నదే నా తాపత్రయం. నేను ఎప్పుడైనా డిస్ట్రబ్డ్ గా ఉంటే… నాన్న గారి పాటలు పాడుకుంటూ, వింటూ ఉంటాను. “శ్రీకృష్ణపాండవీయం” సినిమాలోని ‘మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా’ అనే పాటను, బ్రహ్మంగారి చరిత్ర సినిమాలోని ‘మాయదారి..’ అనే పాటను వింటూ ఉంటాను’ అని చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

‘పైసా వసూల్’ తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్ తో తనకు సాన్నిహిత్యం పెరిగిందని, త్వరలో పూరీ కాంబినేషన్ లో మరో సినిమా ఖచ్చితంగా చేస్తానని హామీ ఇచ్చారు బాలయ్య. ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. దర్శకత్వం, డైలాగ్స్, మ్యూజిక్ ఇలా ప్రతి ఒక్కటీ బాగా వచ్చాయి. ఈ సినిమా ఇంటర్వెల్ లో ఓ బ్యాంగ్ ఉంది. అది అసలు డైలాగ్. చిన్న డైలాగే అయినా… ఎంతో పదునైన డైలాగ్. ఆ డైలాగ్ ను ఇంకా ఎక్కడా చెప్పలేదు. సినిమా చూస్తారుగా! ‘వచ్చాడు వచ్చాడు వచ్చేశాడు…’ అనే పాట అద్భుతం అంటూ ఫుల్ ఖుషీగా ఉన్నారు బాలయ్య.

ADVERTISEMENT
Latest Stories