భారత్‌లో పాకిస్తానీలు.. ఓటు బ్యాంక్ రాజకీయాలు!

Illegal Pakistanis India, Hyderabad Pakistan citizens, vote bank politics India, Aadhar for foreigners, Telangana illegal immigrants, GHMC elections controversy, Home Ministry order, Congress BJP on illegal migrants, Rahul Gandhi on Pakistan, secularism vs nationalism India

ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థాన్‌ పౌరులందరూ వారం రోజులలోగా స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరికొత్త రాజకీయాలకు బీజం వేసింది. నిజానికి ఇందులో వివాదం ఏమీ ఉండకూడదు.

ADVERTISEMENT

కానీ దేశంలో పలు రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంక్ పెంచుకోవడం కోసం పాకిస్థాన్‌, బాంగ్లాదేశ్ పౌరులకు ఆశ్రయం కల్పిస్తూ వారికి ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు కూడా ఏర్పాటు చేస్తూ వారిని భారత్‌ పౌరులుగా చూపిస్తున్నాయి.

ఇదివరకు గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణ బీజేపి నేతలు హైదరాబాద్‌, పాతబస్తీలో వేలాదిమంది పాకిస్థాన్‌, బాంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారని, తమ పార్టీని గెలిపిస్తే పాతబస్తీపై ‘సర్జికల్ స్ట్రైక్’ చేసి వారందరినీ ఏరి పారేస్తామని బహిరంగంగానే చెప్పారు.

కానీ ఆ ఎన్నికలలో బీజేపి ఓడిపోవడంతో ‘సర్జికల్ స్ట్రైక్’ సంగతి మరిచిపోయారు. వారు మరిచిపోయిన హైదరాబాద్‌లో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ పౌరులు అక్రమంగా నివసిస్తున్నారని వారు చెప్పిన మాటలను ఎవరూ మారిచిపోలేదు.

తెలంగాణ బీజేపి నేతలే ఈ విషయం బయటపెట్టినప్పుడు కేంద్రం హోంశాఖ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనే ప్రశ్నకు సమాధానం లభించదు.

ఇప్పుడు భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీలను గుర్తించి వెనక్కు పంపించాలని కేంద్రం నిర్ణయించడంతో, వారికి రక్షణ, ఆశ్రయం కల్పిస్తున్న రాజకీయ పార్టీలు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక సమర్ధించలేక ఇబ్బంది పడుతున్నాయి.

హైదరాబాద్‌లో సుమారు 200 మందికి పైగా పాకిస్తానీలున్నారని వారిని తక్షణం వెనక్కు తిప్పి పంపాలని కేంద్ర హోం శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన్నట్లు తెలుస్తోంది. అలాగే అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర హోం శాఖ లేఖలు వ్రాస్తున్నట్లు తెలుస్తోంది.

జమ్ము కశ్మీర్‌ ఉగ్రదాడి పేరుతో కేంద్రం హైడ్రామా చేస్తూ బీజేపికి రాజకీయ మైలేజ్ కలిగించాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

పాకిస్థాన్‌పై భారత్‌ సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడే చేయలేదని వాదించిన రాహుల్ గాంధీ వంటి రాజకీయ నాయకులు, ఇప్పుడు రాజకీయాలు చేయకుండా ఊరుకుంటారా?ఈ పేరుతో బీజేపి మత రాజకీయాలు చేస్తే, కాంగ్రెస్‌ మిత్ర పక్షాలు లౌకికవాదం పేరుతో రాజకీయాలు చేయకుండా ఉంటాయా?

ADVERTISEMENT
Latest Stories