అమితాబ్, ఐశ్వర్యలకు ఈడీ సమన్లు!

Panama papers case: Amitabh Bachchan, Aishwarya Raiబాలీవుడ్ ‘సూపర్ స్టార్’ అమితాబ్ బచ్చన్ మరియు ఆయన కోడలు, స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ లను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ మేరకు ఈడీ నోటీసులు జారీ చేసింది. పనామా పేపర్స్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరగనుంది.

విదేశాల్లో పేపర్ (నకిలీ) కంపెనీల్లో ఆస్తులు పెట్టుబడులు పెట్టారని, వాటి పేరుతో కోట్లాది రూపాయలను విదేశాలకు తరలించారని పనామా పేపర్లు ఆరోపించాయి. వీటిపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఈడీ విభాగం నడుం బిగించింది. ఈ నేపథ్యంలో అమితాబ్, ఐశ్వర్యలు విచారణకు హాజరు కానున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories