‘ఖైదీ నంబర్ 150’ ఆడియోకు పవన్ రాకపై స్పష్టత!

Pawan Kalyan Chief Guest For Chiranjeevi Khaidi No 150 Audioదాదాపు దశాబ్ద కాలం తర్వాత మెగాస్టార్ వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్న “ఖైదీ నంబర్ 150” సినిమాపై భారీ నుండి అతి భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయం కూడా మెగా అభిమానులకు ఒక పండగ లాంటి వార్తే. ఇటీవల ‘ధృవ’ ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా విడుదలైన యాక్షన్ లుక్ చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోవడంతో, ఈ సినిమా రాక కోసం అభిమానుల నిరీక్షణ అంతకంతకూ పెరిగిపోతోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో కీలక విషయం అధికారికమైంది. సినిమా ప్రమోషన్ కు కీలక ఈవెంట్ గా భావించే “ఖైదీ నంబర్ 150” ఆడియో విడుదలను విజయవాడలో జరిపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి విజయవాడ మేయర్ కార్యాలయానికి కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ ఒక అర్జీని పెట్టుకుంది. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ‘ఖైదీ నంబర్ 150’ ఆడియో వేడుక నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరింది.

ADVERTISEMENT

డిసెంబర్ 25వ తేదీన జరగబోయే ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్, రామ్ చరణ్, వివి వినాయక్, దేవిశ్రీప్రసాద్ మరియు ఇతర అతిధులు హాజరు కాబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ అతిధుల జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. బహుశా పవన్ ఉన్నట్లయితే పవన్ పేరు కూడా ఈ లేఖలో ప్రస్తావించి ఉండేవారని, దీంతో పవన్ రాకపై దాదాపుగా స్పష్టత వచ్చేసినట్లేనన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే పవన్ మినహా మిగతా మెగా హీరోలంతా ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్లు సమాచారం.

pawan-kalyan-chief-guest-for-chiranjeevi-khaidi-no-150

ADVERTISEMENT
Latest Stories