‘పవన్’ను ఏం చేశావయ్యా… అన్న ‘చిరంజీవి’

Pawan Kalyan Chiranjeevi talk Brahmajiపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా తక్కువగా మాట్లాడతారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పవన్ లో మరో యాంగిల్ కూడా ఉంది. అది తను బాగా సన్నిహితంగా ఉన్న వారితో గంటలు, రోజులు అలా గడిపేస్తుంటారు. త్రివిక్రమ్ వంటి వారు ఈ విషయాన్ని పలు సందర్భాలలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అభిప్రాయాన్ని నటుడు బ్రహ్మాజీ కూడా వ్యక్తపరిచారు.

‘తనకు బాగా సన్నిహితంగా మరియు ఇష్టపడే హీరో పవన్ కళ్యాణ్ అని… సహజంగా ఆయన అందరితో ఎక్కువగా మాట్లాడరు.., కానీ మేమిద్దరం ఒకానొక సమయంలో రెండు, మూడు రోజులు అలా మాట్లాడుకుంటూనే ఉన్నామని, ఈ విషయం తెలిసిన చిరంజీవి గారు పిలిచి… ఏమయ్యా… ఏం చేసావు పవన్ కళ్యాణ్ ని? నాగబాబు చెప్తున్నాడు… అలా రోజులు రోజులు మాట్లాడుకుంటున్నారట… అని అంటే, లేదు ‘పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే నేను వింటున్నాను, అంతే’ అని చెప్పాను.

ADVERTISEMENT

నిజానికి తామీద్దరి మధ్య పెద్దగా సినిమాలు లేవని, “జానీ” సినిమాలో చేసాము, ఆ తర్వాత ‘అన్నవరం’ సినిమా చేయాలన్నపుడు, ఆ సినిమా తమిళ సిడి ఇచ్చి చూడమన్నారని, ఆ తర్వాత ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా చేసామని, సినిమాల పరంగా కంటే, తామిద్దరం వ్యక్తిగతంగా బాగా కలుస్తామని చెప్పుకొచ్చారు. అయితే కలిసిన సందర్భాలలో రాజకీయాలు అస్సలు మాట్లాడుకోమని, సినిమాలకు సంబంధించిన వ్యక్తులతో పవన్ అసలు రాజకీయాలు ప్రస్తావించరని తెలిపారు బ్రహ్మాజీ.

ఇక, తన పొలిటికల్ కెరీర్ కు వచ్చేసరికి, ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉండి కూడా, రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నారంటే ఏదొకటి చేయాలన్న పట్టుదలతోనే వస్తున్నారేమోనని తనకు అనిపిస్తుందని, అయితే రాజకీయం అనేది ఆయన వ్యక్తిగత విషయమని, ప్రజలకు ఏదైనా మంచి చేస్తే మంచిదే కదా అంటూ పవన్ పొలిటికల్ కెరీర్ పై తన అభిప్రాయాన్ని చెప్పారు. సినిమాల పరంగా ఎంత వ్యాఖ్యానించినా… రాజకీయ పరంగా మాట్లాడాల్సి వచ్చేసరికి బ్రహ్మాజీ చాలా సేఫ్ గా మాట్లాడడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories