కేంద్రంపై పోరాటానికి పవన్ కళ్యాణ్ కలిసి రావాలని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన నేపథ్యంలో జనసేన అధినేత ఎట్టకేలకు స్పందించారు. ‘‘175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తున్నాం. వామపక్షాలతో తప్ప ఎవ్వరితోనూ కలిసి వెళ్లం. యువతకు, మహిళలకు ఎక్కువ అవకాశం ఇస్తాం. దయచేసి అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు. ముక్తకంఠంతో ఖండించండి’” అని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా జనసేన పార్టీ తమ ట్విటర్‌లో పేర్కొంది.
అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందనపై విశ్లేషకులు తప్పు పడుతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు జనసేనతో ఒక చీకటి ఒప్పందం ఉందని ఇండైరెక్టుగా ఒక మెస్సేజ్ పంపారు. పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీతోనే అన్నట్లుగా ప్రచారం. దీని ద్వారా జనసేన ఓట్లు కొన్ని టీడీపీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో సాక్షి కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని చంద్రబాబు పవన్ కళ్యాణ్ రహస్య మిత్రులని ప్రోగ్రాంలుఎం వ్యాసాలు రాసేసింది.
పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే క్రమంలో తమకు నష్టం జరగొచ్చని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒక్కటే అని చెప్తే ఆయనకు పడే ఓట్లు టీడీపీ నుండే వెళ్తాయని వైకాపా వ్యూహం. దీనికి చంద్రబాబు ఇతోధికంగా సాయం చేశారు. ఈ రెండు వర్గాలను సమర్ధవంతంగా తిప్పి కొట్టడంలోనే జనసేన విజయం ఉంటుంది. ఏ పార్టీతోనూ.. అంట కాగే ప్రశ్నే లేదని.. స్వతంత్రంగా ఎదిగుతామని కాన్ఫిడెన్స్ ను.. అభిమానుల్లోకి పంపించగల్గితేనే జనసేనకు మనుగడ ఉంటుంది.
సొంతంగా గెలిచే పరిస్థితి లేదు అనిపిస్తే చాలా మంది ఓటర్లు జారిపోతారు. అయితే ఈ విషయాన్నీ పవన్ కళ్యాణ్ చాలా తేలికగా తీసుకున్నట్టుగా కనిపించింది. చంద్రబాబు స్టేట్మెంటు తరువాత దాదాపు 36 గంటల వరకు అసలు స్పందనే లేదు. ఈ లోగా మౌనం అర్ధ అంగీకారమా అంటూ విశ్లేషణలు జరిగిపోయాయి. జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ డైరెక్టుగా మీడియా ముందుకో ఆయన ట్విటర్ లో మాట్లాడటమో చెయ్యకుండా తీరికగా ప్రచారమంతా జరిగిపోయాక బయటకు వచ్చారు. పెద్ద పామును కూడా చిన్న కర్రతో కొట్టడమేంటి పవనూ?



