పవన్ ఫ్యాన్స్ అంటే ఇలా ఉంటారు!

Pawan kalyan fans again started on Mahesh Kathi‘జ‌న‌సేన’ అధినేత పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ అభిమానులు త‌న‌ను వేధిస్తున్నార‌ని సినీ విశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి ఆ మ‌ధ్య మీడియా ముందుకు వ‌చ్చి త‌న బాధ‌ను చెప్పుకున్న విష‌యం తెలిసిందే. అయితే ప‌వ‌న్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి తనకింకా వేధింపులు త‌గ్గ‌డం లేదని మరోసారి ఫేస్ బుక్ వేదికగా

ప‌వ‌న్ కళ్యాణ్ అభిమానులంటే ఎలాగుంటారో చెబుతూ వాట్స‌ప్‌లో త‌న‌ను బూతులు తిడుతూ మెసేజ్‌లు పెడుతున్నార‌ని త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ప‌వ‌న్ ఫ్యాన్స్ త‌న‌ను తిడుతున్నార‌డానికి సాక్ష్యంగా వాట్స‌ప్ స్క్రీన్ షాట్‌ని కూడా పోస్ట్ చేశాడు.

ADVERTISEMENT

అందులో ప‌రుష ప‌ద‌జాలంతో మ‌హేశ్ క‌త్తిని పీకే ఫ్యాన్స్ తిట్టిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. అలాగే ఓ మొబైల్‌ నెంబ‌రు నుంచి త‌న‌కు కాల్ వ‌చ్చింద‌ని, త‌న‌ను ఓ అభిమాని బెదిరించాడ‌ని ఆ ఫోన్ నెంబ‌రుని మ‌హేశ్ క‌త్తి పోస్ట్ చేశాడు. మరోసారి పవన్ ఫ్యాన్స్ వర్సెస్ మహేష్ కత్తి సీన్స్ కు సీక్వెల్ ప్రారంభమైనట్లు కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories