ఇటీవలే ప్రగతిభవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ ను జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ కలిసి రావడం, అయన కొత్తగా ప్రవేశపెట్టిన 24 గంట ఉచిత వ్యవసాయ విద్యుత్తు స్కీం ను పొగిడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా కేసీఆర్ కు పవన్ కళ్యాణ్ ఒక ఆహ్వానం పంపారు.
ఆయన నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటుచేయనున్నారు. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శక, నిర్మాతలు స్పష్టంచేశారు. శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను చిత్ర నిర్మాత చినబాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలిశారు.
‘అజ్ఞాతవాసి’ సినిమా చూసేందుకు రావాలని ఆయనను ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఆహ్వానించకపోయినా ఒక స్టార్ హీరోను కాదని ఇలాంటి విషయాల్లో ముందుకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఇది పవన్ తరపు ఆహ్వానం అనే అనుకోవాలి. తెలంగాణాలో పొత్తు పొదుపుకు ఇది సంకేతమా?



