సోషల్ మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే పవన్ కళ్యాణ్… ఒక్క ట్విట్టర్ ను మాత్రం తన ‘జనసేన’ పార్టీ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ పరమైన అంశాలను మాత్రమే ఇందులో పోస్ట్ చేసే పవన్ కళ్యాణ్, అందుకు విరుద్ధంగా తొలిసారి ఓ అభిమాని ఫోటోను పోస్ట్ చేయడం విశేషం.
పవన్ కళ్యాణ్ ఏంటి? అభిమాని ఫోటో పోస్ట్ చేయడం ఏంటి? అని ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. స్వయంగా తాను తీసుకున్న సెల్ఫీనే పవన్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి అభిమానులందరికీ కొత్త ఉత్సాహన్నిచ్చారు. బహుశా ఇది ప్రారంభం ఏమో… భవిష్యత్తులో ఇలాంటి ‘సిత్రాలు’ మరిన్ని ‘జనసేన’ అధినేత ట్విట్టర్ ఖాతాలో దర్శనమిస్తాయేమో… అన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.
“సామాజిక, ఆర్ధిక పరివర్తన కోసం నిరంతరం పనిచేసి అలుపు ఎరుగని కార్యకర్త మా ‘నిమ్మల వీరన్న’తో…” అంటూ పవర్ స్టార్ పోస్ట్ చేసిన ఫోటో కొద్ది నిముషాలలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎప్పుడూ చేయని ఓ పనిని స్వయంగా పవర్ స్టార్ చేస్తే… ఆ మాత్రం హంగామా లేకుండా ఎలా ఉంటుందిలేండి..!


