జనసేన భవిష్యత్తు రాజకీయం ఎలా ఉండబోతుందో?

Pawan Kalyan JanaSena allaince with communists no useజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో ఒంటరిగా వెళ్లే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. టీడీపీ మీద చేస్తున్న విమర్శలతో ఆ పార్టీతో పొత్తు లేనట్టే. వైకాపాతో కలిసి వెళ్లలేని పరిస్థితి, బీజేపీతో వెళ్తే లాభం కంటే నష్టమే ఎక్కువ. ఇక మిగిలింది కమ్యూనిస్టులే. వారితో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే వచ్చే లాభం చాలా తక్కువే.

ADVERTISEMENT

మరోవైపు జనసేన వచ్చే ఎన్నికలలో అన్ని సీట్లలోనూ పోటీ చేసే అవకాశం లేదని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. దీనిబట్టి ఆయన పోటీ చెయ్యడం అంత తేలికగా ఉండదు. బలమైన పార్టీలతో పొత్తులతో ఉంటే కచ్చితంగా కొన్ని సీట్లు గెలిచే అవకాశం ఉండేది ఒంటరిగా వెళ్తే ఇప్పుడు అవి కూడా కష్టమే.

దీనితో జనసేన వ్యూహమేంటో చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఆ పార్టీ శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఆ పార్టీకి సపోర్ట్ చేసే కాపులు ఎలాగైనా తమ వాడిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆరాటపడుతున్నారు. చూడాలి వారి కోరిక ఏ విధంగా నెరవేరుతుందో?

ADVERTISEMENT
Latest Stories