కాపులను నమ్ముకునే పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నారా?

Pawan Kalyan Attended Kapu Community Meetingజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా తమ వైపునకు తిప్పుకోవాలని వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలో సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జనసేనతో కలిసి పోటీ చేయాలని ప్రతిపాదించారు. కాని పవన్ కళ్యాణ్ ఆయనను నేరుగా కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని సమాచారం.

[m9ad]

ADVERTISEMENT

ఇక ఎపిలో సిపిఐ కార్యదర్శి రామకృష్ణ చాలా ప్రయత్నం చేశారు. పదిహేనో తేదీన జరిగిన వామపక్షాల గర్జనకు పవన్ ను తీసుకు వెళ్లాలని,తద్వారా ప్రత్యామ్నాయ వేదికను ప్రజలకు పరిచయం చేయాలని భావించారు. కాని పవన్ కళ్యాణ్ అక్కడకు కూడా వెళ్లలేదు. ఒక దశలో వామపక్షాలతో కలిసి పవన్ కళ్యాణ్ కూటమి కడతారన్న ప్రచారం జరిగింది.

కాని ఆయన ఏ సంగతి తేల్చకపోవడం వామపక్షాలకు నిరాశ కలిగించే అంశమే. తెలంగాణాలో పోటీ చేసి సరైన ఫలితాలు రాకపోతే ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పడుతుందని పవన్ భావిస్తున్నారట. అలాగే ఇప్పటికే కేసీఆర్ ను పలుసార్లు మెచ్చుకుని ఇప్పుడు వామపక్షాలతో ఆయనకు వ్యతిరేకంగా పోటీ చెయ్యడం మంచిది కాదని ఆయన అనుకుంటున్నారట.

అయితే పవన్ కళ్యాణ్ కాపులను నమ్ముకునే రాజకీయం చేస్తున్నారని ఆ మేరకు గణనీయమైన సంఖ్యలో ఆ సామాజికవర్గం తెలంగాణాలో లేకపోవడంతో ఆయన అక్కడి రాజకీయాల మీద పెద్దగా నమ్మకం లేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణాలో ఆయన వైఖరితో ఆంధ్రాలో వామపక్షాలలో కూడా టెన్షన్ మొదలయ్యిందట.

ADVERTISEMENT
Latest Stories