‘కాటమరాయుడు’ సంక్రాంతి స్పెషల్ న్యూస్!

Pawan-Kalyan-Katamarayudu-Release-Dateతమ అభిమాన హీరో పవర్ స్టార్ సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు రానున్నాడా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సంక్రాంతి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. “కాటమరాయుడు” టీజర్ విడుదల తేదీ నుండి సినిమా రిలీజ్ వరకు పక్కా సమాచారం వెలువడింది. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల కాబోయే టీజర్ హంగామా, మార్చి 29న విడుదల కాబోయే సినిమా వరకు కొనసాగనుంది.

సంక్రాంతి స్పెషల్ గా విడుదల చేసిన పోస్టర్ పవన్ అభిమానులకు కన్నులవిందుగా మారిన నేపధ్యంలో… వారికి ఈ సంక్రాంతి మరింత స్పెషల్ అయ్యేందుకు ఈ స్పెషల్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మార్చి 1వ తేదీన “కాటమరాయుడు” ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతుండగా, అదే 29వ తేదీన సినిమా విడుదలకు ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT

సమ్మర్ మొదలు కాకముందే బాక్సాఫీస్ ను హీట్ పుట్టించడానికి పవన్ రంగం సిద్ధం చేస్తున్నాడు. ఏప్రిల్ నెలాఖరున “బాహుబలి” సినిమా విడుదల కానుండడంతో, ఈ విడుదల తేదీలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. అంతేగాక, ఈ నెలలోనే ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేయబోతున్నారనే సమాచారం కూడా, ఈ విడుదల తేదీని ఖరారు చేస్తోంది.

ADVERTISEMENT
Latest Stories