పవన్… బ్యాక్ టు కాటమరాయుడు..!

pawan-kalyan-katamarayudu-shooting-set-photo-with-fans-photoడాలీ దర్శకత్వంలో “కాటమరాయుడు” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో… ఒక్కసారిగా అనంతపురంలో ‘జనసేన’ బహిరంగ సభను ప్రకటించడంతో, షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. అక్కడ మొదలైన బ్రేక్, అలా ‘కోటి దీపోత్సవాలు’ కార్యక్రమం వరకు సాగింది. అయితే డిసెంబర్, జనవరి నాటికి “కాటమరాయుడు” సినిమా షూటింగ్ పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకోవడంతో, మళ్ళీ బ్యాక్ టు సెట్స్ అన్నారు పవర్ స్టార్.

శుక్రవారం నుండి ప్రారంభమైన కొత్త షెడ్యూల్ నుండి ఓ ఫోటో సోషల్ మీడియాలోకి ప్రవేశించింది. తన అభిమానితో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దిగిన ఈ ఫోటోలో, యధావిధిగా సింపుల్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. అయితే ఎంతో ఆప్యాయతతో అభిమానిపై చేయి వేసి మరీ పవన్ ఇచ్చిన ఫోజు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యేలా చేసింది. నిజానికి గతంలో ఇలా అభిమానులను ప్రోత్సహించని పవన్, ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ నుండి మాత్రం అభిమానులతో ఎక్కువగానే ఫోటోలు దిగుతున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories