పవన్‌ కళ్యాణ్ కు ఎప్పుడూ డబ్బు యావే

Pawan Kalyan Likes Money says minister jawahar జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తెలుగు దేశం ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతుండడంతో ఆ పార్టీ నేతలు కూడా స్పందించాల్సి వస్తునట్టుంది. పవన్ కళ్యాణ్ కు ఎప్పుడూ డబ్బు యావేనని ఏపీ మంత్రి జవహర్‌ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుటి నుంచి డబ్బులు తీసుకోవడం పవన్‌కు అలవాటుగా మారిందన్నారు.

ADVERTISEMENT

[m9ad]

పవన్‌కు చంద్రబాబును గద్దె దించాలనే లక్ష్యం తప్ప.. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. మూడు రోజులు ఆంధ్రలో తిరిగి.. ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్ చెక్కేసే పవన్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అభిప్రాయపడ్డారు. నియోజకవర్గానికి 25 కోట్లు ఖర్చు పెట్టేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని పవన్‌ వ్యాఖ్యానించడం అర్థరహితమన్నారు.

పవన్, జగన్ ఇద్దరూ బీజేపీని కాపాడటానికే చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారని జవహర్‌ అన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జవహర్ సొంత జిల్లా పశ్చిమ గోదావరిలో పర్యటిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడి లోకల్ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories