మహేష్ ఆగడం లేదు… పవన్ ఫ్యాన్స్ వదలట్లేదు..!

Mahesh Kathi Pawan Kalyan Controversyగత కొన్ని రోజులుగా పవన్ అభిమానులు – మహేష్ కత్తి మధ్య జరుగుతున్న ఫేస్ బుక్ యుద్ధం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ విశేషం ఏమిటంటే… పవన్ ను విమర్శించడంపై మహేష్ కత్తి వెనక్కి తగ్గడం లేదు… అలాగే మహేష్ పై దండయాత్ర చేయడంలో పవన్ ఫ్యాన్స్ తగ్గడం లేదు. మరి దీనికి శుభంకార్డు ఎలా పడుతుందో గానీ, తన ఫోన్ పై పవన్ అభిమానులు ఇంకా దాడి చేస్తూనే ఉన్నారని, దీనిని మరింత ఉధృతికి తీసుకువెళ్తారో లేక ఆపుతారో వారిష్టమేనని, తాను దేనికైనా సిద్ధం అనిపించే విధంగా మహేష్ తాజాగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు.

అంతకుముందు మరోసారి పవన్ చేసిన కామెంట్స్ ను గుర్తు చేస్తూ… ‘జనసేన’ అధినేతపై మండిపడ్డారు కత్తి. ఓ పక్కన రిజ‌ర్వేష‌న్లు లేని స‌మాజం కావాలంటూనే, మరో పక్కన మ‌ళ్లీ కాపుల‌కు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోవాల‌ని పవన్ కళ్యాణ్ అనడం ఏంట‌ని మామూలుగానే తీవ్ర విమ‌ర్శ‌లు వస్తున్న నేపధ్యంలో… ప‌వ‌న్ చెప్పిన మాట‌ల్లో అవగాహనా రాహిత్యం, మూర్ఖత్వం మాట్లాడిన మాట‌లు అక్షరం అక్షరం కనిపిస్తున్నాయి అని మహేష్ క‌త్తి ధ్వ‌జ‌మెత్తుతూ సుదీర్ఘమైన ప్రసంగం ఇచ్చారు.

ADVERTISEMENT

‘రాజ్యాంగం మీద అవగాహన, రాజకీయ పరిణితి చాలా దూరం. కనీసం కామన్ సెన్స్ లేని ఇలాంటి స్టేట్‌మెంట్స్‌ పవన్ కళ్యాణ్ తెలియనితనాన్ని సూచిస్తున్నాయి. తరతరాల రిజర్వేషన్ల అమలులోని అవకతవకలతో పోరాడుతూ, ఇప్పటికీ వివక్ష అనుభవిస్తున్న కోట్ల మంది దళితుల గురించి మాట్లాడని ఇతడు… దళిత సమస్యలు, హత్యలు, ఆత్మహత్యలు జరిగినప్పుడు కనీసం ట్వీట్ చెయ్యని ఇతను… ఇప్పుడు రిజర్వేషన్ల గురించి అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాడు’ అని పేర్కొన్నాడు.

“కనీసం 1% కూడా లేని క్రిమిలేయర్ పెద్ద సమస్య అన్నట్టు పోజులిస్తున్నాడు. అవగాహనా రాహిత్యం, మూర్ఖత్వం మాట్లాడిన అక్షరం అక్షరం కనిపిస్తున్నాయి. ఇప్పుడే కదా కాపులు తమ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. ముద్రగడ గురించి మాట్లాడమంటే, సెన్సిటివ్ విషయాలపై స్పందించను అనే ఈ పలాయనవాది, దళితుల రిజర్వేషన్ల నిర్ములనే ధ్యేయంగా ఉన్నట్టు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడో చూస్తే, ఇతని దళిత వ్యతిరేకత సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇదే జనసేన పంథా అయితే, ఇదే ఇతగాడి “స్థాయి” అయితే, మనం తీవ్రంగా ఆలొచ్చించాల్సిన విషయం అని” మహేష్ కత్తి పేర్కొన్నాడు.

ADVERTISEMENT
Latest Stories