ఫ్యాన్స్ ను గందరగోళానికి గురి చేసిన పవన్!

PAWAN KALYAN Message to his overseas Fans on Agnyaathavaasi“అజ్ఞాతవాసి” సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండడంతో, చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ చేత ఇప్పించిన ఓ వీడియో అభిమానులను తీవ్ర గందరగోళానికి గురి చేసింది. యుఎస్ లో భారీ స్థాయిలో విడుదల కాబోతున్న నేపధ్యంలో… అమెరికన్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్తూ ఓ వీడియోను రిలీజ్ చేసారు. అయితే ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్లుగా కనపడుతుందే తప్ప, వాయిస్ మాత్రం వినిపించడం లేదు.

ADVERTISEMENT

దీంతో అసలు పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో అర్ధంకాక అభిమానులు తలలు పట్టేసుకున్నారు. మరింత హాస్యాస్పదమైన అంశం ఏమిటంటే… ఈ వీడియోలో వాయిస్ వినాలంటే హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలని, మామూలుగా అయితే వీడియో ప్లే అవుతుంది గానీ, పవన్ స్వరం వినాలంటే హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలని కొందరు అభిమానులు సూచించడం. దీంతో ఇలాంటి వీడియోలు కూడా ఉంటాయా? అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తుండడం విశేషం. ఒక్క నిముషం పాటు సాగిన ఈ వీడియో ఫ్యాన్స్ ను అయోమయంలో పడేసింది. అయితే ఎట్టకేలకు మళ్ళీ వాయిస్ తో కూడిన వీడియోను అప్ లోడ్ చేసారనుకోండి!

ADVERTISEMENT
Latest Stories