కనీసం ఇలా అయినా చేయొచ్చు కదా!

Pawan Kalyan NTRతెలుగు ప్రేక్షకులు ఆశించే విధంగా ‘మల్టీస్టారర్’ సినిమాలు తెరకెక్కవన్న విషయం బహిరంగమే. మార్కెట్ లో పాటు అభిమానుల మదులలోనూ క్రేజీ హీరోలుగా భావించే పవన్ – మహేష్ – జూనియర్ – ప్రభాస్… ఈ నలుగురిలో ఏ ఇద్దరూ ఒకే సినిమాలో కనిపించినా అది ఒక సంచలనమే అవుతుంది. కానీ తెలుగు ప్రేక్షకులు కంటున్న కలలు నిజమయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పట్లో అయితే దానికి స్కోప్ లేదని బహిరంగంగానే చెప్పేయొచ్చు.

ADVERTISEMENT

విక్టరీ వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణల వంటి సీనియర్ హీరోలతో బహుశా మల్టీస్టారర్ సినిమాలు ఉండొచ్చేమో గానీ, ఈ హీరోల నుండి మాత్రం ‘మల్టీస్టారర్’ సినిమాలను ఆశించలేం. అయితే అలాంటి కొరతను కనీసం ఈ విధంగా తీర్చొచ్చు కదా అని… జూనియర్ ఎన్టీఆర్ – పవన్ కళ్యాణ్ లు సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. సోమవారం నాడు ప్రారంభమైన తారక్ కొత్త చిత్రానికి పవన్ కళ్యాణ్ హాజరు కావడం అనేది ఇద్దరు హీరోల అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులకు కూడా కన్నుల విందుగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ముఖ్యంగా ఇలాంటి దృశ్యాలు ఇరువురి హీరోల అభిమానుల్లో సఖ్యతను పెంచడంతో పాటు ఇండస్ట్రీలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఎలాగూ మల్టీస్టారర్ సినిమాలు చేయరు గనుక, ఇలా సినీ ప్రారంభోత్సవాలలో గానీ, ఆడియో వేడుకలపై గానీ లేక ఇతర సినీ వేదికలపై గానీ దర్శనమిస్తే… అభిమానులకు కలిగే ఆనందమే వేరు కదా! పవన్ కళ్యాణ్ – జూనియర్ ఎన్టీఆర్ లు ప్రారంభించిన ఈ సంస్కృతి టాలీవుడ్ లో ఓ సరికొత్త ట్రెండ్ కావాలని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories