పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే నిర్మాతకు సినిమానే?

Pawan Kalyan became headache for movie producersరెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తున్నారు. నిన్న ‘పింక్’ రీమేక్ షూటింగ్లో పాల్గొన్నారు. అయితే, ఫస్ట్ డే ఫస్ట్ షూటింగ్ కూడా హడావిడిగా ముగించారు. ఆఫ్టర్ నూన్ వరకు షూటింగ్ లో పాల్గొని… వెంటనే అమరావతి వెళ్లిపోయారు. అక్కడ రాజధాని తరలింపుకి వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడి చేసేందుకు ట్రై చేశారు.

ADVERTISEMENT

ఈరోజు కూడా విజయవాడ, మంగళగిరి ప్రాంతాలలో వేరు వేరు మీటింగులతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. రేపు ఢిల్లీ వెళ్తున్నారట. అక్కడ అవసరమైతే రెండు మూడు రోజులు ఉండాల్సి రావచ్చట. ఆ తరువాత ప్రోగ్రాం ఏంటో కంఫర్మ్ కాలేదు. మళ్ళీ షూటింగ్ కి ఎప్పుడు వస్తారో ఆయనకే తెలీదు… నిర్మాతకు తెలిసే అవకాశం లేదు.

పవన్ తో షూటింగ్ అంటే.. ఏ రోజు కి ఆ రోజు ప్లాన్ చేసుకోవాలిసిందే. కచ్చితంగా షూటింగ్ డే అంతా ఉంటాడా అనేది ఎప్పుడూ అనుమానమే. దీనితో పవన్ కళ్యాణ్ అవసరం లేని సీన్లు తీసుకున్నటున్నారట. కాకపోతే సినిమాలు పవన్ కళ్యాణ్ వర్క్ కేవలం 20 రోజులే కావడంతో ఎలాగోలా పూర్తి చేసేయ్యొచ్చులే అనుకుంటున్నాడు దిల్ రాజు.

నివేదా థామస్, అంజలి, అనన్య.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హిందీ ‘పింక్’ సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్ కు ఇమేజ్ కు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేశారట. ఇది ఇలా ఉండగా ఈ సినిమాతో థమన్ మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ సినిమాకు పని చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories