తండ్రిలేని పిల్లాడట… ఎంత మాటనేశావు బ్రో!

Jagan Pawan Kalyanజనసేన అధినేత మంగళగిరికి షిఫ్ట్ అయిపోగానే పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయినప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశ్యించి “ప్రజలు తండ్రిలేని పిల్లాడని జాలి పడి గెలిపిస్తే ఏకుమేకై కూర్చోన్నాడు” అంటూ ఆక్షేపించారు. ఇంతకాలం సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితం గురించి చులకనగా మాట్లాడుతూ అవహేళన చేస్తుండేవారు.

కానీ తాము అద్దాలమేడలో కూర్చొని ఎదుటవాళ్ళ మీద రాళ్ళు విసురుతున్నామనే సంగతి మరిచారు. కనుక ఎదుటవాళ్లు నోరువిప్పి మాట్లాడటం మొదలుపెడితే ఏవిదంగా ఉంటుందో నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే వారికి రుచి చూపించారు.

ADVERTISEMENT

ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ ‘తండ్రిలేని పిల్లాడు’ అంటూ ఏదో వ్యంగ్యంగా అన్నట్లు అనిపించినా, అది జగన్‌ చేసిన ఓదార్పుయాత్రలని గుర్తుచేస్తున్నట్లుంది. ఆనాడు వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి చనిపోయినప్పుడు, ఆ సానుభూతిని పొంది దానితోనే వైసీపీని నిర్మించుకొన్న సంగతి అందరికీ తెలుసు.

ప్రతిపక్ష నేతగా జగన్‌ పాదయాత్ర చేసినప్పుడు కూడా నిత్యం తన తండ్రిపేరు చెప్పుకొంటూ తిరిగిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. అందుకే పవన్‌ కళ్యాణ్‌ ‘తండ్రిలేని పిల్లాడు’ అంటూ పోలిటికల్ ర్యాగింగ్ చేస్తున్నారనుకోవచ్చు.

అక్కడ తెలంగాణలో వైఎస్ షర్మిల కూడా ఇదే ఫార్ములా ఫాలో అయిపోతూ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొంటూ తిరుగుతున్నారు. కానీ వానాకాలం మబ్బులే వర్షాలు కురిపిస్తాయి తప్ప వేసవి మబ్బులు కావని జగన్‌ గ్రహించారు కానీ ఆమె గ్రహించిన్నట్లు లేదు.

పవన్‌ కళ్యాణ్‌ బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్రతో మంత్రి అంబటి రాంబాబుకి కూడా సరైన సమాధానమే చెప్పిన్నట్లు ఆయన తిట్లు, శాపనార్ధాలు, ఆక్రోశం వింటే అర్దమవుతుంది. అందుకే అద్దాల మేడలో కూర్చొని ఎదుటవాళ్ళపై రాళ్ళు వేయకూడదని వైసీపీ నేతలందరూ తెలుసుకొంటే వారికే మంచిది.

ADVERTISEMENT
Latest Stories