జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 200 కోట్ల ఆదాయాన్ని త్యాగం చేశానని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన యాత్రలో ఆయన మాట్లాడారు. “సినిమాల్లో పనిచేస్తే నేను రూ.200 కోట్లకు పైనే ఆస్తులు సంపాదించుకోగలిగేవాడిని. వాటిని త్యాగం చేసి ప్రజాసేవ కోసం మీ ముందుకొచ్చాను. రెండు గంటల సినిమాలో ఎన్నో సమస్యలు పరిష్కారం కావచ్చు. నిజజీవితంలో రెండు దశాబ్దాలపైనే పట్టవచ్చు,” అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
[m9ad]
పవన్ కళ్యాణ్ చివరి సినిమా రిలీజ్ అయ్యింది ఈ సంవత్సరం జనవరిలో. పవన్ కళ్యాణ్ సహజంగా ఈ మధ్య స్పీడ్ పెంచాకా రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. సినిమాకు 30 కోట్లు ముట్టాయి అనుకున్నా ఆయన మహా అయితే ఒక 30 కోట్లు త్యాగం చేశారనుకోవచ్చు. 2018 ఎన్నికలలో ఓడిపోతే పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలలోకి వెళ్ళడం ఖాయమని ఆయన అభిమానులు కూడా అనుకుంటున్నారు. చంద్రబాబు, జగన్ కూడా రాజకీయాలు వదిలేసి పూర్తి స్థాయిగా వ్యాపారం మీద దృష్టి పెడితే వారూ ఎక్కువే సంపాదిస్తారు.
మరో వైపు చంద్రబాబుకు పవన్ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. “2019 నాటికి నేను సీఎం కావాలని అనుకోలేదు, దృష్టి కూడా పెట్టలేదు, అయినా ప్రజల్లో సామాజిక మార్పు కోసం రావలసి వచ్చింది. ‘తెగింపు, బాధ్యత ఉన్న వ్యక్తులు కావాలి. లోకేశ్‌లా దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేవారు ఎందుకు? బాబు, లోకేశ్ సహా టీడీపీ నాయకులు నా పట్ల చిల్లర వేషాలు వేస్తున్నారు. ఆపకపోతే నాలో వేరే వ్యక్తిని చూస్తారు,” అన్నారు. పవన్ కళ్యాణ్ లోని వేరే మనిషి బయటకు వచ్చి ఆయన సీఎం అయితే వారి అభిమానులు దానిని ఆహ్వానిస్తారు. పైగా ఈ మధ్య సభలలో పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అని అరవమని ముచ్చట పడుతున్నారు… ఆయన ముచ్చటా తీరుతుంది.



