మోడీ పై పవన్ ప్రేమ బీజేపీకి జగన్ ని దూరం చెయ్యగలదా?

Pawan Kalyan with PM Modi

దేశ ప్రధాని నరేంద్ర మోడీ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు అపారమైన ప్రేమను, గౌరవాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు. భారతదేశ రాజకీయాలలో మోడీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ఒక చరిత్రే, దేశ ప్రధానులలో మోడీకి ఎప్పుడు అగ్రస్థానమే అన్నట్టుగా పవన్ మోడీ పై తన ప్రేమను బహిరంగంగానే వ్యక్తపరుస్తారు.

అయితే పవన్, మోడీ మీద చూపేంత ప్రేమ మోడీ తిరిగి పవన్ పై చూపిస్తున్నారా.? మోడీ వారసులుగా చెప్పుకునే బీజేపీ నేతలు పవన్ కోసం అంతే బలంగా నిలబడగలుగుతున్నారా.? అంటే అందుకు జవాబు జనసేన శ్రేణులతో పాటుగా తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుసు.

ADVERTISEMENT

అయితే నేడు భోగాపురం ఎయిర్ ఫోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోడీకి అభినందనలు తెలియచేస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో మోడీ పాత్ర పాత్ర పై ధన్యవాదాలు తెలుపుతూ, సీజేపీ నీట్ ఉద్యమ సమయంలో జీన్ జీల పేరుతో కొంతమంది మోడీ పై చేసిన నీచమైన విమర్శల పట్ల పవన్ పరోక్షంగా స్పందించారు.

నేటి తరం యువతకు ప్రధానిగా దేశం కోసం మోడీ చేస్తున్న కష్టం అర్థకావడం లేదని, ముందుగా యువత సంస్కారం నేర్చుకోవాలని, కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న చందంగా దేశ అభివృద్ధి కోసం నిత్యం పరితపిస్తున్న మోడీ పై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలా.? అంటూ మోడీ కి సభ వేదిక సాక్షిగా తన మద్దతు తెలియచేసారు పవన్.

అయితే మోడీ రాజకీయం గా కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ ఈ రకంగా మోడీకి అండగా మేమున్నాము అనే భరోసా అందించారు. మోడీ తానూ వద్దనుకుంటే తప్ప తన వద్ద నుంచి అధికారం దూరమవ్వదని, దేశంలో మోడీ ని మించిన బలమైన నేత మరొకరు లేరంటూ మోడీ నాయకత్వాన్ని చాల బలంగా సమర్ధించారు పవన్.

మరి పవన్ ఇంతలా మోడీ కోసం ముందుకొచ్చినా, మోడీ నాయకత్వం మీద తన బలమైన స్వరాన్ని వినిపించినా, ఆయన కోసం కన్నీళ్లు కార్చినా బీజేపీ ఇప్పటికి వైసీపీ కోసం ఆరాటపడుతుందా.? మోడీ పై పవన్ ప్రేమ “బీజేపీ – వైసీపీ తెరవెనుక బంధానికి కంచెలు వేయలేవా”.? పవన్ “ఆత్మీయ ఆలింగనం కంటే కూడా వైసీపీ అంతర్గత కౌగాలి” బీజేపీ కి అవసరంగా మారుతుందా.?

ADVERTISEMENT
Latest Stories