వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేని పిచ్చి కుక్క తో పోల్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan warning to grandhi Srinivasగత ఎన్నికలలో తనను ఓడగొట్టిన భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వివరాల్లోకి వెళ్తే… పవన్ కళ్యాణ్ సహా జనసేన నాయకులపై… మత్స్యపురి అనే గ్రామంలో గ్రంధి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ADVERTISEMENT

అది ఇప్పుడు పవన్ వరకు చేరినట్టుగా ఉంది. భీమవరం ఎమ్మెల్యే ఓ ఆకు రౌడీ అని… కో ఆపరేటివ్ బ్యాంకులను దోచుకున్న వ్యక్తి అని విరుచుకుపడ్డారు ఆయన. 151 మంది ఎమ్మెల్యేలు సేవ చేయడం మాని ప్రజలను హింసిస్తున్నారని పవన్ ఆరోపించారు.

అలాగే తన పై వ్యక్తిగత విమర్శలు చేసిన సదరు ఎమ్మెల్యేని పిచ్చి కుక్కతో పోల్చారు పవన్ కళ్యాణ్. రోడ్డుపై వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయని, కానీ మనం కూడా అదే పని చెయ్యలేం… పిచ్చి కుక్కల కోసం మునిసిపాలిటీ వాన్ వస్తుంది తప్పకుండా అంతవరకు సంయమనం పాటించి వేచి చుడండి అంటూ జనసైనికులకు పిలుపునిచ్చారు.

కాగా… వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం మత్స్యపురిలో జనసేన కార్యకర్తలు దళితులపై దాడి చేశారని… అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసి ధ్వంసం చేశారని.., దళిత పక్షపాతి అయిన తమ ఎమ్మెల్యే అది చూసి పవన్ కళ్యాణ్, జనసైనికుల మీద మండిపడ్డారని చెబుతున్నారు. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పై గ్రంధి శ్రీనివాస్ 8,357 ఓట్ల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories