యాదగిరి గుట్ట పాలకమండలితో కాంగ్రెస్‌లో చిచ్చు?

Yadagirigutta Temple Board row

యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం పాలకమండలి నియామకాలు అధికార కాంగ్రెస్ పార్టీలోనే సెగలు పుట్టిస్తోంది. ప్రతిపక్షాల కంటే ముందు సొంత పార్టీ నేతలే ప్రభుత్వం నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు సమాచారం ఇవ్వకుండా పాలక మండలి ఏర్పాటు చేయడాన్ని కొందరు తప్పు పడుతున్నారు. కనీసం నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియజేయకుండా రహస్యంగా పాలకమండలిని ఏర్పాటు చేయడాన్ని మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పు పట్టారు.

ADVERTISEMENT

పాలకమండలి ఛైర్మన్ పదవిని బీఆర్ఎస్ మద్దతుదారుడికి ఇచ్చారని, బీజేపీకి మద్దతుదారులని సభ్యులుగా నియమించిన తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం, పార్టీ కోసం పని చేసిన తమవంటి వారిని మాత్రం విస్మరించారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ విమర్శలతో యాదగిరిగుట్ట పాలకమండలి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు, ప్రభుత్వానికి మద్య సమన్వయ లోపం ఉందనే విషయం స్పష్టమవుతోంది. కాంగ్రెస్‌ అధిష్టానం, సిఎం రేవంత్ రెడ్డి పార్టీలో సీనియర్లను పట్టించుకోకపోవడం వల్లనే తాను పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌ పార్టీలో చేరుతున్నానని సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అదే చెపుతున్నారు!

ADVERTISEMENT
Latest Stories