‘ఖైదీ’ చూసిన పవన్ కళ్యాణ్… మరి స్పందనేది..?

Pawan Kalyan Watched Khaidi No.150మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “ఖైదీ నంబర్ 150” చూస్తారన్నది నిన్నటి మాట. ఈ సినిమా కలెక్షన్స్ గురించి చెప్తున్న సమయంలో అల్లు అరవింద్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ… నేటి సాయంత్రం పవన్ ఈ సినిమాను చూడబోతున్నారు అని చెప్పారు. అలాగే ‘పవన్ కళ్యాణ్ గారి’ కోసమని నిర్మాత రామ్ చరణ్ ఒక స్పెషల్ షోను కూడా ఏర్పాటు చేసారని తెలిసింది. ఈ సినిమాను చూసిన పవన్, చిత్ర నిర్మాత చెర్రీ వద్ద సంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT

అయితే ట్విట్టర్ వేదికగా ‘దంగల్’ సినిమా గురించి ప్రస్తావించిన పవన్, అలాంటి అనుభూతులనే తన సోదరుడు ప్రతిష్టాత్మక సినిమా గురించి ఎందుకు ప్రస్తావించలేదు? అన్న ఆలోచన అభిమానులను వేధిస్తోంది. అందులోనూ పదేళ్ళ తర్వాత చిరంజీవి వెండితెరపై కనిపిస్తుండడంతో, తన అన్నయ్య సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా పవన్ అతనా భావాలను వ్యక్తపరుస్తారని ట్రేడ్ వర్గాలు భావించారు. కానీ, అలా జరగలేదు. పవన్ సినిమా చూసిన మాట వాస్తవమే అయినా, అభిమానులకు తెలిసే విధంగా ఒక్క ప్రకటన చేయకపోవడం కాస్త ఆలోచించదగ్గ విషయమే.

ADVERTISEMENT
Latest Stories