చేతికి సెలైన్ డ్రిప్‌తో పవన్ కళ్యాణ్‌.. ఏమయిందో పాపం!

Pawan Kalyan with saline drip Attends 16th Finance Commission Meet

ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ దంపతులు ఇటీవల సింగపూర్ నుంచి కొడుకు మార్క్ శంకర్‌ని వెంటబెట్టుకొని హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఆయన భార్య అన్నా లెజినోవా గుండు కొట్టించుకొని చీర కట్టుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆ తర్వాత తన కొడుకు పేరిట రూ,17,00,000 అన్నదానానికి విరాళం ఇచ్చి, స్వయంగా భక్తులకు భోజనాలు వడ్డించారు.

ADVERTISEMENT

ఆమె విదేశీయురాలు, క్రీస్టియన్ అయినప్పటికీ స్కూల్లో అగ్నిప్రమాదం నుంచి కొడుకు ప్రాణాలతో బయటపడటంతో తిరుమల శ్రీవారికి ఈవిదంగా మొక్కు చెల్లించుకోవడం, అన్నదాన కార్యక్రమంలో స్వయంగా పాల్గొనడంపై సర్వత్రా ప్రశంశలు వచ్చాయి.

కానీ పవన్ కళ్యాణ్‌ ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్ళి వచ్చిన ప్రతీసారి తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. పవన్ కళ్యాణ్‌ సతీసమేతంగా మహాకుంభమేళకు వెళ్ళి రాగానే జ్వరంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఆ తర్వాత కొడుకుతో కలిసి కేరళ, తమిళనాడులో తీర్ధయాత్రలు చేసి రాగానే మళ్ళీ అస్వస్థతకు గురయ్యారు.

ఇప్పుడు సింగపూర్ నుంచి తిరిగి రాగానే మళ్ళీ అస్వస్థతకు గురయ్యారు. ఏపీ మంత్రివర్గ సమావేశానికి బయలుదేరి అస్వస్థతకు గురవడంతో వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు.

నేడు సచివాలయంలో 16 వ ఆర్ధిక సంఘం ప్రతినిధులతో సమావేశమైనప్పుడు చేతికి సెలైన్ డ్రిప్‌తో పవన్ కళ్యాణ్‌ కనిపించడం చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నిత్యం ప్రభుత్వ పనులతో, రాజకీయాలతో చాలా బిజీబిజీగా గడుపుతుంటారు. తరచూ రాష్ట్రంలో పర్యటిస్తుంటారు. హైదరాబాద్‌, తిరుపతి వెళ్ళి వస్తుంటారు. కానీ 74 ఏళ్ళ వయసులో కూడా ఎప్పుడూ చాలా ఆరోగ్యంగా, చాలా చురుకుగా ఉంటారు.

కానీ ఆయన కంటే వయసులో చాలా చిన్నవాడైన డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. బహుశః పవన్ కళ్యాణ్‌కు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్లనే తరచూ అనారోగ్యం పాలవుతున్నారేమో? ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్‌ ఇంకా చాలా కాలం రాజకీయాలలో కొనసాగాల్సి ఉంటుంది కనుక ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపడం చాలా అవసరం.

ADVERTISEMENT
Latest Stories