టిడిపి వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి డిల్లీలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కొన్ని రోజుల క్రితం కలిసారు. ఆ ధేల్లి ప్రయతాన తెలంగాణా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఐతే రేవంత్ రెడ్డి వెనక్కు తగ్గి తెదేపాలో కంటిన్యూ అయ్యేలా ఉన్నారు. ఐతే ఈ దుమారం మాత్రం ఆగేలా లేదు.
గతంలో కేసీఆర్తో ఏకాంత చర్చలు జరిపిన పయ్యావుల కేశవ్ ను రేవంత్ తప్పు పడితే ఇప్పుడు కేశవ్ ఎదురు దాడి. చేశారు. రేవంత్ రెడ్డి కు వ్యక్తిగత అజెండాలే ప్రధానమని ఆరోపించారు. పెళ్లిలో కెసిఆర్ ను కలిస్తే ఇంత యాగీ చేస్తారా అని ఆయన అన్నారు. రాహుల్ ను రేవంత్ ఎందుకు కలిశారని ఆయన అన్నారు.
ఆరు నెలలుగా రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలపై తన వద్ద పూర్తి వివరాలు ఉన్నాయని తెలిపారు. ఆయన చంద్రబాబును కలిశాకే ఆ వివరాలపై స్పందిస్తానని ఆయన చెప్పారు. చంద్రబాబు ను కలిసి రేవంత్ ఏదైనా ఇబ్బంది ఉంటే మాట్లాడుకుని ఉండాల్సిందని ఆయన అన్నారు. రేవంత్ కోసం తాను నష్టపోయానని ఆయన అన్నారు.


