సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఈ స్మాల్ ఫిల్మ్!

Pelli Choopulu Critic Talk, Pelli Choopulu Reviewers Talk, Pelli Choopulu Websites Positive Talk, Pelli Choopulu Movie Websites Positive Articles పబ్లిసిటీలో ఒక్కొక్కరికి ఒక్కో శైలి. అయితే భారీ సినిమాలకు పబ్లిసిటీ ఖర్చు కూడా భారీగానే ఉంటుంది కాబట్టి, పెద్ద చిత్రాల పబ్లిసిటీకి పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవచ్చు. అయితే చిన్న సినిమాల వరకు ‘కంటెంట్’ మాత్రమే మాట్లాడాలి. అదే ‘కంటెంట్’ను టీజర్, ట్రైలర్ల రూపంలో ప్రేక్షకులకు చేరువయ్యేలా చూడాలి. లేదంటే పబ్లిసిటీతో అయినా ప్రేక్షకులను ఆకర్షించాలి. ఒకవేళ ఈ రెండు కుదిరితే… అది చిన్న సినిమా అయినా పెద్ద విజయం సాధించే దిశగా దూసుకెళ్ళడం ఖాయం.

సరిగ్గా ఇదే బాటలో పయనిస్తోంది… “పెళ్లిచూపులు” సినిమా. ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్లు, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు, ఈ సినిమా పబ్లిసిటీ టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా విడుదల కానుండగా, ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోల పేరుతో ఈ సినిమా ప్రదర్శనలు జరిగాయి. ట్రైలర్ మాదిరిగానే సినిమా కూడా ఆకట్టుకునే విధంగా ఉండడంతో, ఇప్పటికే వెబ్ వరల్డ్ లో ‘పెళ్లిచూపులు’ సినిమా పాజిటివ్ రివ్యూలు వచ్చేసాయి.

ADVERTISEMENT

ఈ ప్రభావం ఖచ్చితంగా ఈ సినిమా ఓపెనింగ్స్ పై పడుతుందని చెప్పవచ్చు. సినిమా విడుదలకు 3 రోజులకు ముందే నెట్టింట్లో దర్శనమిచ్చిన రివ్యూల ప్రభావం ప్రేక్షకులపై ఏ విధంగా ఉందో చెప్పడానికి ఈ సినిమా ఓపెనింగ్స్ ఒక కీలక అంశం కానుంది. బహుశా ఇది సక్సెస్ అయితే మరికొన్ని సినిమాలు ఇదే బాటలో పయనించడం సహజంగా జరిగే ప్రక్రియే. ప్రీమియర్ షోలు టాలీవుడ్ కు కొత్త కాకపోయినా, విడుదలకు ముందు రోజు మాత్రమే, ఇవి ప్రదర్శితమయ్యేవి. కానీ, ‘పెళ్లిచూపులు’ సినిమా బృందం మాత్రం సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. అయితే అంతటా పాజిటివ్ టాక్ కాబట్టి, పరిస్థితి ఇలా ఉంది, ఒకవేళ అదే నెగిటివ్ అయితే మొత్తానికే మోసం వచ్చేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ADVERTISEMENT
Latest Stories