టాలీవుడ్ హీరో మంచు విష్ణుపై దేశద్రోహం కేసు!

police case on manchu vishnu comments on india divisionఇండియాను రెండు ముక్కలు చేయాలంటూ టాలీవుడ్ హీరోమంచు విష్ణు చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్, వనస్థలిపురం పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. విష్ణుపై దేశద్రోహం సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని నరేంద్ర మోడీ విచార్ మంచ్ ఫిర్యాదు చేసింది. ఆయన బాధ్యతారాహిత్యంతో మాట్లాడారని, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని సంఘం నాయకులు ఆరోపించారు.

“లక్కున్నోడు” చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో… దేశంలో ప్రభుత్వాలు దక్షిణాది ప్రజలు నిర్ణయిస్తేనే ఏర్పాటవుతున్నాయని, అయినా, ఇక్కడి ప్రజలకు సరైన గుర్తింపు రావడం లేదని, అలాంటప్పుడు కలసి వుంటే లాభం లేదని, ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలను రెండు దేశాలుగా విభజించాలని విష్ణు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడే ఇవే వ్యాఖ్యలు విష్ణుపై కేసుకు కారణమయ్యాయి.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories