వైఎస్ వివేకానంద రెడ్డి అత్యంత దారుణంగా హత్య చేయబడితే ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘చిన్న పిల్లోడి’ని మాజీ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా వెనకేసుకువచ్చినందున సీబీఐ కూడా ఆ పిల్లోడిని టచ్ చేయలేకపోయింది.
ఇంతవరకు సీబీఐ ప్రధాన నిందితులను అరెస్ట్ చేయలేకపోయింది. అరెస్టయిన కొద్ది మందీ ఇలా లోపలకు వెళ్ళి అలా బయటకు వచ్చేస్తున్నారు. 2014 లో వివేకా హత్య జరిగితే నేటికీ ఆ కేసు హైకోర్టు-సుప్రీంకోర్టు మద్య తిరుగుతూనే ఉంది.
Also Read – టిడిపికి కోటి దండాలు.. సభ్యత్వాలు!
కానీ సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాటలలో రేవతి అనే మహిళ చనిపోగా, వెంటనే అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేయడం, వారం రోజులలోనే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి.
అల్లు అర్జున్ అజాగ్రత్త లేదా ఊహించకపోవడం వల్లనే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి మహిళ చనిపోయింది తప్ప ఆయన ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదు. కనుక అల్లు అర్జున్‌కి వెంటనే బెయిల్ మంజూరయ్యే అవకాశం ఉంది.
Also Read – దావోస్‌లో కూడా ఏపీ, తెలంగాణ మద్య పోటీ.. తప్పదా?
పోలీసులు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసి గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్ళి వైద్య పరీక్షలు చేయిస్తారు. తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. చట్ట ప్రకారం ఆయనకు న్యాయస్థానం 2 వారాలు జ్యూడిషియల్ రిమాండ్ విధించవచ్చు.
కానీ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వెంటనే బెయిల్ దరఖాస్తు సమర్పిస్తే బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియలో ఆలస్యం అయితే శనివారం, ఆదివారం కోర్టుకి సెలవులు గనుక సోమవారంనాడు బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుంది. అంతవరకు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ ఎలాగూ సాగుతుంది.
Also Read – కుమారస్వామికి అలా పుణ్య ఫలం దక్కింది!
అయితే అల్లు అర్జున్‌పై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ 105, 108 (1) రెడ్ విత్ 3 (5) బిఎన్‌ఎస్ కింద కేసు నమోదు చేయడం, కేసు నమోదు చేసిన వారం రోజులలోనే అరెస్ట్ చేయడం ఆలోచింపజేస్తుంది.
సాధారణంగా పోలీసులు ముందుగా నోటీస్ ఇచ్చి విచారణకు పిలిపిస్తారు. ఆ తర్వాత అవసరమైతే అరెస్ట్ చేస్తుంటారు. కానీ అల్లు అర్జున్‌కి పోలీసులు ముందుగా నోటీస్ ఇచ్చారా లేదా?అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది.
ఒకవేళ నోటీస్ ఇచ్చినా ఇంత వేగంగా అరెస్ట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీని వెనుక రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అల్లు అర్జున్ అరెస్ట్‌పై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ ఘాటుగా స్పందించారు. “జాతీయ అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్‌ని ఇంత హడావుడిగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అభద్రతాభావంతో ఉందో తెలియజేస్తోంది. తొక్కిసలాటలలో మహిళ చనిపోవడం చాలా బాధాకరమే. కానీ ఎవరి వైఫల్యం వలన థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది?సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తిని ఓ సాధారణ క్రిమినల్లా పరిగణిస్తూ అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాము,” అని ట్వీట్ చేశారు.