పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ మీద కత్తి మహేష్ చేసిన విమర్శలు సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. దీనిపై పవన్ కళ్యాణ్ గానీ పూనమ్ కౌర్ గానీ స్పందించలేదు. అయితే నిన్న అర్ధరాత్రి పూనమ్ కౌర్ వీటిపై పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించాలని, తన జీవితం, పరువు, కెరీర్ ని దెబ్బ తీసే విధంగా ఉన్న వీటిపై క్లారిటీ ఇవ్వాలని కోరింది.
అదేవిధంగా తాను ఎవరి పొలిటికల్ అజెండాకు పాముని కాబోనని, సమయమిస్తే మిమల్ని కలిసిమాట్లాడతా అని వేడుకుంది. అయితే కొద్దీ సేపటికే ఆ ట్వీట్స్ ను ఆమె డిలీట్ చేసారు. మరోవైపు టీవీ9 తో మాట్లాడుతూ ఆమె సోదరుడు శ్యామ్ సింగ్ కత్తి మహేష్ మీద కేసు పెడతామని హెచ్చరించారు.
మూడు సంవత్సరాలుగా తన సోదరి చేనేతను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చెయ్యడానికి కష్టపడుతుందని దానిని గుర్తించి చంద్రబాబు నాయుడు ఆమెను ఆంధ్ర ప్రదేశ్ చేనేత అంబాసిడర్ గా చేసారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారో లేదో చూడాలి.








