గూడార్ధాలతో కూడిన ట్వీట్లను చేయడంలో సిద్ధహస్తురాలిగా పేరు గాంచిన టాలీవుడ్ హీరోయిన్ పూనం కౌర్, తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సింపుల్ గా “నెక్స్ట్ ఏంటి???” అంటూ చేసిన ట్వీట్ కు పవన్ కళ్యాణ్ మీద రిప్లైలు రావడం గమనార్హం. ఇప్పటికే ఆరేడు చోట్ల తాను పోటీచేయనున్నానని పవన్ చేసిన ప్రకటనకు ఈ ‘నెక్స్ట్ ఏంటి’ అన్నది కౌంటర్ గా అభివర్ణిస్తున్నారు.
[m9ad]
అలాగే జనసేన తర్వాత ప్రజాసేన అని ఒకరంటుంటే, కరెక్ట్ గా నాలుగే ఎందుకు? అని మరొకరు, నెక్స్ట్ సిఎం పవన్ కళ్యాణే అని ఫ్యాన్స్…, ఇలా పవన్ మద్దతుదారులు, ప్రత్యర్ధి వర్గాలు ఇరువురు కూడా ఈ ట్వీట్ రిప్లైలు ఇస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయమే “నెక్స్ట్ ఏంటి?” సినిమా పేరుతో సందీప్ కిషన్, నవదీప్, తమన్నాలతో ఒక సినిమా పేరును ప్రకటించారు.
బహుశా ఈ సినిమాలో పూనం కూడా భాగస్వామి అయ్యిందో ఏమో గానీ, ఆ టైటిల్ నే ట్వీట్ చేయడంతో ఇందులో వంద అర్ధాలను వెలికితీసే పనిలో నెటిజన్లు ఉన్నారు. తలచినదోకటి…. జరిగినదోకటి…. అంటే ఇదేనా? లేక పూనం కౌర్ తలచినదే జరుగుతోందా? అనేది ఆమె నోరు విప్పితే తప్ప తెలిసే అవకాశం లేదు. ఇంతకీ పూనం కౌర్ “నెక్స్ట్ ఏంటి”లో ఉన్న అర్ధం ఏమిటో?!



